చాలా మందికి టీ అంటే ఓ ఎమోషన్. వేడుకలు జరిగినా, రీఫ్రెష్ అవ్వాలన్నా చాలా మంది టీ వైపే మక్కువ చూపుతారు. కానీ చాలా మంది అత్యంత ఎక్కువ ఇష్టపడే ఈ పానీయం నిద్రలేమి, ఒత్తిడి, జీవ సమస్యలకు కారణమవుతుందని మీకు తెలుసా? కొన్ని పదార్ధాలను ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరం. అందులో టీ ఒకటి. కాబట్టి మీరు కూడా టీకి అడిక్ట్ అయినట్లు అనిపిస్తే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
టీ ఆకుల్లో సహజంగా ఉండే కెఫిన్ ఆందోళన, ఒత్తిడిని పెంచుతుంది. ఇది క్రమేణా తలనొప్పి, కండరాల ఒత్తిడి, భయాన్ని కూడా ప్రేరేపిస్తుంది. అదే గనక మితిమీరితే మీ మానసిక శ్రేయస్సుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. రోజుకు 200 mg కంటే తక్కువ కెఫీన్ తీసుకున్న చాలా మందిలో ఆందోళన కలిగించే అవకాశం అంతగా ఉండదని పరిశోధనలు సూచిస్తున్నాయి.
నిద్ర లేకపోవడం లేదా స్లీప్ డిజార్డర్స్.. లాంటి సమస్యలతో బాధపడుతుంటే ముందుగా మీకు టీ అలవాటు ఉందేమో ఒక్కసారి ఆలోచించండి. టీలో ఉండే కెఫిన్ వల్ల అది నిద్రపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మెలటోనిన్ అనేది మీ మెదడుకు నిద్రపోయే సమయాన్ని సూచించే హార్మోన్. దీన్ని ఉత్పత్తిని కెఫీన్ నిరోధించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఫలితంగా కావల్సినంత నిద్ర కరువవుతుంది.
తక్కువ పోషక శోషణ... కెఫిన్ ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు తీవ్ర ఆటంకం కలుగుతుంగి. టీ అనేది టానిన్లు అని పిలువబడే సమ్మేళనాల గొప్ప మూల. ఇది జీర్ణవ్యవస్థలో శోషణకు అడ్డంకిగా మారుతుంది.
టీ తాగడం.. ముఖ్యంగా పాలతో కూడిన టీ మీకు వికారంగా అనిపించవచ్చు. ఇది టానిన్ల ఉనికి వల్ల ఏర్పడుతుంది. ఫలితంగా జీర్ణ కణజాలం చికాకుకు గురవుతుంది. దాంతో పాటు ఉబ్బరం, అసౌకర్యం, కడుపు నొప్పికి దారితీస్తుంది.
గర్భిణీ స్త్రీలకు హానికరం - టీ ఎక్కువగా తీసుకోవడం తల్లికి అలాగే ఆమెకు పుట్టబోయే బిడ్డకు హానికరం. టీ లోని అధిక కెఫిన్ వల్ల గర్భస్రావం లేదా అకాల పుట్టుక లాంటి మరిన్ని వంటి సమస్యలకు దారి తీస్తుంది.
టీలోని కెఫిన్ అసిడిటీ, గుండెల్లో మంటను కలిగించవచ్చు. లేదా ముందుగా ఉన్న యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. మనలో చాలా మంది బెడ్ టీని ఆస్వాదిస్తూ ఉంటాం. అందువల్ల తరచుగా ఉదయం పూట, ఖాళీ కడుపుతోనూ టీ తీసుకుంటూ ఉంటాం. కానీ కాలక్రమేణా అది జీవక్రియ ప్రక్రియను మందగించేలా చేస్తుంది. దాంతో పాటు గ్యాస్, కడుపు ఉబ్బరానికి దారి తీయవచ్చు.