టీ స్టాల్ లో సోలార్ ప్యానెల్..ప్రతి నెలా కరెంట్ బిల్లు ఆదా

టీ స్టాల్ లో సోలార్ ప్యానెల్..ప్రతి నెలా కరెంట్ బిల్లు ఆదా

ఇక్కడ  టీ స్టాల్ నడుపుతున్న వ్యక్తి పేరు నట్టుభాయ్ వాస్వాని. ఇతడి వయసు 60 ఏళ్లు. గుజరాత్ లోని సూరత్ ఉద్నాలో  35 ఏళ్లుగా   జై రామ్ జీ  అనే టీ స్టాల్ ను   నడుపుతున్నాడు. ఇతను  చాయ్  వాలా చాచాగా చాలా పాపులర్. తన తెలివి తేటలతో ప్రతి నెలా వెయ్యి వరకు కరెంటు బిల్లు ఆదా చేస్తున్నాడు నట్టుభాయ్. ఎందుకంటే  టీ స్టాల్ లో  ఫ్యాన్లు, లైట్లన్ని సోలార్ ప్యానెల్ తో  రన్ చేస్తూ.. ప్రతి నెలా రూ.1000 నుంచి రూ.1500 వరకు కరెంట్ బిల్లు ఆదా చేస్తున్నాడు. సోషల్ మీడియాలో  ఇతడి టీ స్టాల్ చూసి అతడి తెలివి తేటలను ప్రశంసిస్తున్నారు నెటిజన్స్.

నట్టుభాయ్ కి  ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే.. తన స్వగ్రామానికి వెళ్లినప్పుడు  సోలార్ ప్యానెల్స్‌ని చూసి అతను   టీ స్టాల్‌లో వాటిని ఎందుకు ఉపయోగించకూడదని డిసైడ్ అయ్యాడంట. అపడు  వెంటనే అహ్మదాబాద్‌కి వెళ్లిన నట్టుభాయ్ రూ. 2,500కి సోలార్ ప్యానెల్‌ని కొనుగోలు చేసి  టీ స్టాల్‌లో అమర్చాడు. దీంతో ఇపుడు టీ స్టాల్ లో ప్రతి నెలా కరెంట్ బిల్లును ఆదా చేస్తుండు. ఇలా తన ఖర్చును తగ్గించుకుంటుండు.