పది వేల మొక్కలు నాటిన టీచర్ సాహో

పది వేల మొక్కలు నాటిన టీచర్ సాహో
  • చెట్ల మాస్టారు సాహో

ఆ మాస్టారుకి నేచర్​ అంటే ప్రాణం. అడవులు కాలిపోతున్నా, చెట్లు నరికేస్తున్నా సాహో మాస్టారు గుండె విలవిల్లాడుతుంది. పర్యావరణాన్ని రక్షించుకుంటేనే మనం భూమ్మీద బతకగలం. లేకుంటే జీవరాశి మనుగడకే ముప్పు వస్తుందంటూ ఆర్ట్ తో అవగాహన కల్పిస్తున్నాడు. సైకిల్ మీద ఊరూరూ తిరుగుతూ మొక్కలు నాటుతూ.. నాటిస్తున్నాడు.

ఒడిశాలోని కాంటిలో గ్రామంలో 72 ఏళ్ల రిటైర్డ్​ టీచర్​ అంతర్యామి సాహో.  ‘గచ్చా సర్’​ అని కూడా పిలుస్తుంటారు ఆయన అభిమానులు. గచ్చా అంటే ఒడియా భాషలో ‘చెట్టు’ అని అర్థం. నేచర్​ అంటే ఆయనకు చెప్పలేనంత ఇష్టం. అందుకే పర్యావరణాన్ని కాపాడండి అంటూ అవగాహన కల్పిస్తున్నాడు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని1961లో మొదలుపెట్టాడు సాహో. ఇప్పటికి 30వేల చెట్లు నాటాడు. 1973లో స్కూల్ టీచర్​గా జాయిన్​ అయ్యారు. ఆరు స్కూల్స్​లో పని చేసిన ఆయన అన్ని చోట్లా ప్లాంటేషన్​ ప్రోగ్రామ్​ని కూడా కంటిన్యూ చేశారు. విత్తనాల కోసం ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​ వాళ్లని అడిగి తీసుకునేవాళ్లు. వాటితో ఒక నర్సరీ ఏర్పాటుచేశాడు. ‘‘నన్ను చూసి చాలామంది ఇన్​స్పైర్​ అవుతున్నారు. ఒక్కడినే పదివేల చెట్లు నాటాను. నా స్టూడెంట్స్​ హెల్ప్​తో 20వేల మొక్కలు నాటించాను. నేను నాటిన వాటిలో టేకు, మర్రి, మామిడి వంటి రకాల మొక్కలున్నాయి. నేచర్​ని మనమే కాపాడుకోవాలి. అందుకే నేను ఈ పని చేస్తున్నా’ అంటాడాయన. ఈ వయసులో ఇంత శ్రమ అవసరమా? అని అడిగితే... ‘ఆశయానికి వయసుతో పని లేద’ని చెబుతాడు.