దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ముందు ఉపాధ్యాయుల ఆందోళన

దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ముందు ఉపాధ్యాయుల ఆందోళన

మంచిర్యాల జిల్లాలో ఓరియంట్ సిమెంట్ కంపెనీ ముందు ఉపాధ్యాయులు, విద్యార్థులు నిరసన చేపట్టారు. కాసిపేట మండలం దేవపూర్ ఓల్డ్ కార్మెల్ గిరి పాఠశాలలో ఓరియంట్ సిమెంట్ కంపెనీ యాజమాన్యం.. గత మూడు నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని వారు ఆందోళన నిర్వహించారు. వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలుపుతున్నాడు. రాత్రంతా సెల్ టవర్ పైనే ఉండి ఆందోళన చేస్తున్నారు. 

సమాచారం అందుకున్న పోలీసులు దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణకు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమకు వెంటనే వేతనాలు చెల్లించాలని అప్పటివరకు తమ ఆందోళన కొనసాగిస్తున్నామని నిరసన చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.