టీచర్లే పిల్లల భవిష్యత్కు మార్గదర్శకులు

టీచర్లే పిల్లల భవిష్యత్కు మార్గదర్శకులు

జైనూర్/ తిర్యాణి/కాసిపేట/కాగజ్ నగర్/లక్సెట్టిపేట, వెలుగు: ఉపాధ్యాయుల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జైనూర్, తిర్యాణి మండలంలోని ప్రభుత్వ స్కూళ్లలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఫొటోలకు నివాళులు అర్పించారు. పట్నాపూర్, జైనూర్, రాసిమెట్ట ఆశ్రమ గర్ల్స్ హైస్కూల్, పోచంలొద్ది, మార్లవాయి గౌరి, పానపట్టర్, తిర్యాణి ఆశ్రమ బాయ్స్ తదితర స్కూళ్లలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించి క్లాస్‌రూమ్‌లను సందడిగా మార్చారు. అనంతరం తమ టీచర్లను సన్మానించారు. దేవాపూర్ ​ఓరియంట్​ గోల్డ్ ​లయన్స్​క్లబ్ ​ఆధ్వర్యంలో డీఏవీ స్కూల్​లో వేడుకల నిర్వహించారు. 15 మంది టీచర్లను, కాసిపేట జర్నలిస్టులను సన్మానించి జ్ఞాపికలు అందించారు. 

ఎంఈవో వెంకటేశ్వర్లు చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. లయన్స్ ​క్లబ్​మైక్రో క్యాబినెట్​పీఎస్టీ ఫోరం చైర్​పర్సన్​ జి.వెంకటరమణ, క్లబ్​ అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు, కార్యదర్శి సాయికుమార్, కోశాధికారి నిఖిల్​ రెడ్డి, ప్రిన్సిపాల్​కిరణ్​ కుమార్ పాల్గొన్నారు. లక్సెట్టిపేటలోని ఆర్ అండ్ బీ విశ్రాంతి భవనం ఆవరణలో టీచర్లను కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ సన్మానించారు. క్రమశిక్షణకు మారుపేరుగా నవోదయలు నిలుస్తున్నాయని నవోదయ విద్యాలయ హైదరాబాద్ రీజియన్ అసిస్టెంట్ కమిషనర్ చక్రపాణి అన్నారు. కాగజ్ నగర్ జవహర్ నవోదయలో నిర్వహించిన వేడుకలకు ఆయన చీఫ్​గెస్ట్​గా హాజరై మాట్లాడారు.