టీచర్లకు చెప్పొస్తలె.. పిల్లలకు సమజైతలె

టీచర్లకు చెప్పొస్తలె.. పిల్లలకు సమజైతలె

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌తో కుస్తీ
ఎన్‌‌‌‌సీఈఆర్టీ సర్వేలో వెల్లడి
27% మందికి డిజిటల్‌ పరికరాల్లేవ్‌‌‌‌
28% మందికి కరెంటు కష్టాలు

న్యూఢిల్లీ: దేశంలో 27% మంది స్టూడెంట్లకు ఆన్‌‌‌‌లైన్‌ ‌‌‌ఎడ్యుకేషన్‌‌‌‌కు అవసరమైన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు లేవంట. 28% మంది కరెంటు కోతలతో ఇబ్బంది పడుతున్నారట. స్మార్ట్‌‌‌‌ డివైజ్‌‌‌‌ లు వాడటం రాక స్టూడెంట్లు, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఎట్ల చెప్పాలో అర్థంకాక టీచర్లు ఇబ్బంది పడుతుండటంతో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఎడ్యుకేషన్‌ ‌‌‌కష్టమైపోతోందట. నేషనల్‌‌ ‌‌కౌన్సిల్‌‌ ‌‌ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ‌‌‌రీసెర్చ్‌‌ ‌‌అండ్‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌(ఎన్‌‌‌‌సీఈఆర్టీ) ఇటీవల చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేంద్రీయ, నవోదయ, సీబీఎస్‌‌‌‌ఈ స్కూళ్లకు చెందిన స్టూడెంట్లు, వాళ్ల తల్లిదండ్రులు, టీచర్లు, స్కూల్‌‌‌‌ ప్రిన్సిపల్స్‌ ‌‌‌అందరూ కలిపి సుమారు 34 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారని ఎన్‌‌‌‌సీఈఆర్టీ చెప్పింది.

టీవీలు, రేడియో తక్కువ వాడుతున్నరు
సుమారు 36% మంది స్టూడెంట్లు చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్‌ ‌‌‌వాడుతున్నారని సర్వే చెప్పింది. ఆ తర్వాత ఎక్కువమంది ల్యాప్‌‌‌‌ టాప్‌‌‌‌లు వాడుతున్నారంది. టీవీలు, రేడియోలను చాలా తక్కువగా వాడుతున్నారని తెలిపింది. ఆన్‌‌‌‌లైన్‌‌ ‌‌ఎడ్యుకేషన్‌‌‌‌లో టీచర్లు, స్టూడెంట్ల మధ్య మాట్లాడుకోవడం తక్కువైందని వెల్లడించింది. చాలా రాష్ట్రాల్లో పిల్లలు ఎలా చదువుతున్నారో టీచర్లు ఇంటికెళ్లి చెక్‌ ‌‌‌చేస్తున్నారని చెప్పింది. సగంమంది స్టూడెంట్లు తమ దగ్గర టెక్స్ట్ బుక్స్‌‌ ‌‌లేవన్నారని.. ఆ బుక్స్‌‌‌‌ ఎన్‌‌‌‌సీఈఆర్టీ, దీక్షా వెబ్‌సైట్‌‌‌‌లో ఉన్నాయని వివరించింది. ఇంటర్నెట్‌‌‌‌లో అందుబాటులో ఉన్న పుస్తకాలపై పెద్దగా అవగాహన లేక స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారని, కొందరికి స్మార్ట్ డివైజెస్‌ ‌‌‌లేవని చెప్పింది.

మ్యాథ్స్ అర్థమైతలేదు
ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో లెక్కలు వింటుంటే అర్థం కావట్లేదని చాలామంది స్టూడెంట్లు చెప్పినట్టు ఎన్‌‌‌‌సీఈఆర్టీ పేర్కొంది. టీచర్‌‌ ‌‌సపోర్ట్‌‌‌‌తో చేస్తేనే లెక్కలు, వాటి పద్ధతులు సరిగ్గా అర్థమవుతాయని వివరించింది. మ్యాథ్స్‌‌‌‌తర్వాత సైన్స్‌‌‌‌ చాలా కష్టంగా ఉందని స్టూడెంట్లు చెప్పినట్టు వెల్లడించింది. ఆన్‌‌‌‌లైన్‌ ‌‌‌ఎడ్యుకేషన్‌‌‌‌లోనూ ఫిజికల్‌ ‌‌‌ఎడ్యుకేషన్‌ ‌‌‌అవసరమని స్టూడెంట్లు, పేరెంట్స్‌ ‌‌‌చెప్పినట్టు సర్వే పేర్కొంది. ఆర్ట్స్ ఎడ్యుకేషన్‌‌ ‌‌కూడా ఉంటే ఒత్తిడి దూరమవుతుందని పిల్లలు, పేరెంట్స్‌‌‌‌ అభిప్రాయపడ్డారంది.

For More News..

ఢిల్లీలో 29% మందిలో యాంటీబాడీలు

11 రోజుల్లో ఢిల్లీలో రికార్డు వర్షం

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌కు కరోనా