ఆదిలాబాద్లో కేటీఆర్ కు నిరసన సెగ

 ఆదిలాబాద్లో కేటీఆర్ కు నిరసన సెగ

ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కేటీఆర్ ర్యాలీలో ఉపాధ్యాయుల నిరసన నినాదాల చేపట్టడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. జీవో 317ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు తెలిపిన టీచర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా పోలీసులు -టీచర్లకు మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. న్యాయమైన డిమాండ్ కోసం తాము ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలియజేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ టీచర్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల వాదనలతో గందరగోళం ఏర్పడింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో వినిపించని పరిస్థితులు నెలకొన్నాయి.

మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్ర కరణ్ రెడ్డిలతో కలసి మంత్రి కేటీఆర్ జిల్లాలో పర్యటనుకు వచ్చారు. ముందుగా జైనథ్ మండలం దీపాయిగూడలో ఎమ్మెల్యే జోగు రామన్నను పరామర్వించిన అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ చేపట్టారు.