జడ్పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీచర్ల జీతాల రికవరీ పేరిట నిధుల గోల్ మాల్

జడ్పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీచర్ల జీతాల రికవరీ  పేరిట నిధుల గోల్ మాల్
  • ఎల్ఎండీ స్కూల్ కాంప్లెక్స్ లో లీవులో ఉన్న టీచర్లకు శాలరీ బిల్లులు 
  • జీతం క్రెడిట్ అయ్యాక రికవరీ పేరిట వసూళ్లు
  • రూ.10లక్షలు ట్రెజరీలో చెల్లించకుండా స్వాహా?
  •  బ్లైండ్​ క్లర్క్ దంపతులపై హెడ్మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదు
  •  ప్రాథమిక విచారణ లేకుండా ఫిర్యాదు ఆధారంగా కేసు

కరీంనగర్, వెలుగు:సెలవులో ఉన్న టీచర్లు స్కూల్ కు వచ్చినట్లు ఫుల్ అటెండెన్స్ వేసి శాలరీ బిల్లులు చేయడం, తీరా వారికి జీతం క్రెడిట్ అయ్యాక శాలరీ రికవరీ అంటూ వసూళ్లకు పాల్పడడం, ఆ డబ్బును ట్రెజరీలో చెల్లించకుండా స్వాహా చేయడం ద్వారా సుమారు రూ.10 లక్షల మేర స్వాహా చేసిన సంఘటన ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీ కాలనీలో జడ్పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెలుగుచూసింది.

డ్రాయింగ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న స్కూల్ హెడ్మాస్టర్ రాజభాను చంద్రప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఈ వ్యవహారంతో తనకేమీ సంబంధం లేనట్లుగా స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పని చేసే అంధులైన క్లర్క్ తిరుమల, ఆమె భర్త రాజ్ కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు కూడా ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండానే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

లీవ్ లో ఉన్నవారికి బిల్లులు చేసిన హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం 

తిమ్మాపూర్ మండలం ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీ కాలనీ జడ్పీ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డ్యూటీ చేసే టీచర్లు ఫారిన్ ట్రిప్, మెడికల్, చైల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితర వ్యక్తిగత కారణాలతో లీవ్ పెట్టారు. స్కూల్ హెచ్ఎం రాజభాను చంద్రప్రకాశ్ వారు సెలవులో ఉన్నట్లు కాకుండా పనిచేసినట్లు రికార్డులో నమోదు చేయడం వివాదాస్పదంగా మారింది. ఇలా శాలరీ బిల్లు చేసి పంపడంతో వారి అకౌంట్లలో ఫుల్ శాలరీ క్రెడిట్ అయ్యేది. 

ఆ తర్వాత సదరు టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హెచ్ఎం ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి.. మీకు లీవ్ శాంక్షన్ కాలేదని, పొరపాటున శాలరీ పడిందని, దాన్ని వెనక్కి పంపితే చలానా రూపంలో తిరిగి ప్రభుత్వానికి పంపుతానని చెప్పేవారు. ఇలా 2021 నుంచి 2024 వరకు పలువురు టీచర్ల దగ్గర సుమారు రూ.10 లక్షల వరకు హెచ్ఎం రికవరీ చేశారు. అయితే ఆ డబ్బును ట్రెజరీలో  చెల్లించలేదు. ఎవరైనా అడిగితే నకిలీ చలానాలు చూపేవారు. అంతేగాక ఐటీ రిటర్నుల విషయంలోనూ ఇలాగే చేసి డబ్బులు వసూలు చేసేవాడని క్లర్క్​ దంపతులు వెల్లడించారు. 

ప్రతీసారి టీచర్ల డబ్బును తెలివిగా తమకు ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే/ గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పే చేయించేవాడని, వాటిని మేం డ్రా చేసి నగదు రూపంలో హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంకు అందజేసేవారమని వెల్లడించారు. ఇటీవల కొందరు టీచర్లకు అనుమానం వచ్చి నిలదీసేసరికి విషయాన్ని తమపైకి నెట్టాడని వాపోయారు. అంతేగాక తమను బెదిరించి ఇటీవల తమతో బలవంతంగా తామే ఈ డబ్బులు తీసుకున్నట్లు లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం పోకుండా ఉండాలంటే.. రూ.7 లక్షలు కట్టాలని బెదిరిస్తే.. తాము అప్పు చేసి ఆ డబ్బు ఇచ్చామని తెలిపారు. ఇదంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాక తన పాత్ర లేకుండా చూపేందుకు ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసి, సమాజంలో తమను దోషులను చేశాడని ఆవేదన వ్యక్తంచేశారు. 

యూఎస్​కు వెళ్లిన టీచర్​కూ.. 

తిమ్మాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలంలోని ప్రైమరీ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎస్జీటీ టీచర్ 2022 సెప్టెంబర్ లో అమెరికాకు వెళ్లారు. ఇందుకోసం ఆరు నెలలపాటు ముందస్తుగా డీఈవో వద్ద అనుమతి పొందారు. రూల్స్ ప్రకారం సదరు టీచర్ సెలవు ముగించుకుని డ్యూటీలో జాయిన్ అయ్యాక లీవ్ శాంక్షన్ చేసి శాలరీ బిల్లు చేయాల్సి ఉంటుంది. కానీ సదరు టీచర్ కు నవంబర్ జీతం డిసెంబర్ లో క్రెడిట్ అయింది. దీంతో వెంటనే హెడ్మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సదరు టీచరును సంప్రదించి మొత్తం వెనక్కి తెప్పించాడు.