త్వరలో వర్సిటీల్లో  టీచింగ్‌‌ పోస్టుల భర్తీ

త్వరలో వర్సిటీల్లో  టీచింగ్‌‌ పోస్టుల భర్తీ
  • డిగ్రీలో ఈ ఏడాది క్లస్టర్‌‌ 
  • విధానం తీసుకొస్తం డేటా సైన్స్‌‌, లైఫ్‌‌ సైన్సెస్‌‌ 
  • కోర్సులకు మస్తు డిమాండ్‌‌
  • కాలేజీల్లో అమ్మాయిల ఎన్‌‌రోల్‌‌మెంట్‌‌ పెరిగింది
  • తెలంగాణ ఎడ్యుకేషనల్‌‌ హబ్‌‌గా మారనుంది
  • ‘వీ6 వెలుగు’ ఇంటర్వ్యూలో  ఉన్నత విద్యా మండలి చైర్మన్‌‌ ప్రొఫెసర్‌‌ లింబాద్రి


హైదరాబాద్‌‌‌‌, వెలుగు : త్వరలో యూనివర్సిటీల్లో టీచింగ్‌‌‌‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌ ఇవ్వనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌ లింబాద్రి చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఈ ఏడాది క్లస్టర్‌‌‌‌ విధానాన్ని తెస్తున్నట్లు, తెలంగాణ ఎడ్యుకేషన్‌‌‌‌ హబ్‌‌‌‌గా మారబోతున్నట్లు తెలిపారు. స్టూడెంట్లలో స్కిల్స్‌‌‌‌, క్వాలిటీ పెంచేందుకు బ్రిటీష్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌, మరో 20 సంస్థలతో ఎంవోయూ చేసుకున్నట్లు చెప్పారు. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో అమ్మాయిల ఎన్‌‌‌‌రోల్‌‌‌‌మెంట్‌‌‌‌ పెరిగిందన్నారు. ఈ ఏడాది నుంచి అన్ని కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్‌‌‌‌ కోటా అమలు చేస్తామన్నారు. డిగ్రీలో డేటా సైన్స్‌‌‌‌, లైఫ్‌‌‌‌ సైన్సెస్‌‌‌‌, ఫిజికల్‌‌‌‌ సైన్స్ కోర్సులకు మస్తు డిమాండ్‌‌‌‌ ఉందని, వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో ఒకేషనల్‌‌‌‌ కోర్సులను ప్రవేశపెడతామన్నారు. సోమవారం వీ6 వెలుగు ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. 
ఉన్నత విద్యామండలి ద్వారా స్టూడెంట్స్‌‌‌‌కు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది?
దేశంలో, తెలంగాణలో ఉన్నత విద్యా మండళ్లకు అనేక చాలెంజ్‌‌‌‌లు ఉన్నాయి. రాష్ట్రంలో మాత్రం కొన్ని పాజిటివ్‌‌‌‌ అంశాలు ఉన్నాయి. హయ్యర్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ సగటు జీఆర్‌‌‌‌(గ్రాస్‌‌‌‌ ఎన్‌‌‌‌రోల్‌‌‌‌మెంట్‌‌‌‌ రేషియో) 36 శాతంగా ఉంది. ఇది దేశంలో 26 శాతంగా ఉంది. రాష్ట్రంలో వీకర్‌‌‌‌ సెక్షన్‌‌‌‌ అమ్మాయిలు ఎక్కువగా చదువుతున్నారు. ఇది మంచి ప్రగతిశీల విషయం. చాలా కోర్సుల్లో సగం మంది బాలికలే ఉన్నారు. మన రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్, సంక్షేమ శాఖల్లో గురుకులాల్లో రావడంతోనే ఇది సాధ్యమైంది. 
స్కిల్స్‌‌‌‌, క్వాలిటీ ఉన్న ప్రొఫెషనల్స్‌‌‌‌ దొరకడం లేదనే వాదన వినిపిస్తోంది?
ఇది కొంత వాస్తవమే. ప్రభుత్వం ఐటీ శాఖతో అనేక సమావేశాలు పెట్టింది. వివిధ సంస్థలతో ఎంవోయూ కూడా చేశాం. కొన్ని కోర్సులు ప్రవేశపెట్టాం. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా డేటా సైన్స్‌‌‌‌ కోర్సుకు డిమాండ్‌‌‌‌ ఉంది. ఇండస్ట్రీ ఎకనమిక్‌‌‌‌ కనెక్టివిటీ పెరగాలి. ఈ గ్యాప్‌‌‌‌ పూడ్చే ప్రయత్నం చేస్తున్నం. స్కిల్స్‌‌‌‌, క్వాలిటీ కోసం బ్రిటీష్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌తో ఎంవోయూ చేసుకున్నం. లిబరల్‌‌‌‌ హానర్స్‌‌‌‌, కామర్స్‌‌‌‌ విద్యార్థులకు ఎలా నైపుణ్యం పెంపొందించాలో ప్లాన్ చేస్తున్నం. ప్రాజెక్ట్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌కు కరిక్యులం ఇంపార్టెంట్‌‌‌‌. 
వర్సిటీల్లో రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఎందుకు లేటైంది?
రాష్ట్రం ఏర్పడటానికి ముందే యూనివర్సిటీ గ్రాంట్‌‌‌‌, రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ విషయమంలో గ్యాప్‌‌‌‌ వచ్చింది. అలహాబాద్‌‌‌‌లో రోస్టర్‌‌‌‌ సిస్టంలో ఓ వ్యక్తి హైకోర్టుకు వెళ్లారు. ఆ ఇష్యూ సుప్రీంకోర్టుకూ వెళ్లింది. దీంతో రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ రెండేండ్లు ఆగింది. తర్వాత పార్లమెంట్‌‌‌‌ ఆర్డినెన్స్‌‌‌‌ తెచ్చాక క్లియరెన్స్‌‌‌‌ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌కు ఓకే చెప్పింది. త్వరలోనే నోటిఫికేషన్‌‌‌‌ వేస్తాం. వర్సిటీ సిస్టంలో కాంట్రాక్టు టీచర్లను రెగ్యులరైజ్‌‌‌‌ చేయరాదు. 
ఇంజనీరింగ్‌‌‌‌లో స్టాండర్డ్స్ ఎలా పెంచుతారు?
క్వాలిటీ బాగుండాలంటే మంచి కరిక్యులం, క్వాలిఫైడ్‌‌‌‌ ఫ్యాకల్టీ ఉండాలి. న్యాక్‌‌‌‌ అక్రిడియేషన్‌‌‌‌ ఉన్న కాలేజీలకు గ్రాంట్స్‌‌‌‌ శాంక్షన్‌‌‌‌ చేస్తున్నం. బడ్జెట్‌‌‌‌ కొరతకు సంబంధించి మినిమం రిక్వైర్‌‌‌‌మెంట్‌‌‌‌కు కొరత లేదు. కాంట్రాక్ట్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ లెక్చరర్లకు మంచి జీతాలిస్తున్నం. కొన్ని చోట్ల లెక్చరర్ల కొరత ఉంది. 
మళ్లీ డిగ్రీకి ఇంట్రెస్ట్‌‌‌‌ పెరుగుతోంది కారణం?
దేశం హయ్యెస్ట్ ఎన్‌‌‌‌రోల్‌‌‌‌మెంట్‌‌‌‌ బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లోనే ఉంటుంది. తెలంగాణలో మాత్రం ఇంజనీరింగ్‌‌‌‌, ఎంబీబీఎస్‌‌‌‌ కోరుకుంటున్నరు. ఆఖరికి ఫార్మసీకి వెళ్తున్నరు. రాష్ట్రంలో త్వరలో బీఏ హానర్స్‌‌‌‌ కోర్సు పెట్టబోతున్నం. డేటా సైన్స్‌‌‌‌, లైఫ్‌‌‌‌ సైన్సెస్‌‌‌‌, ఫిజికల్‌‌‌‌ సైన్స్ కోర్సులకు డిమాండ్‌‌‌‌ పెరుగుతోంది. మూడేళ్ల డిగ్రీల తర్వాత మంచి జాబ్‌‌‌‌ చేసుకోవాలని విశ్వాసం పెరిగింది. అందుకే డిగ్రీకి ఇంట్రెస్ట్‌‌‌‌ 
చూపిస్తున్నరు.

ఈడబ్ల్యూఎస్‌‌‌‌ కోటా అమలు చేస్తరా..?
ఈడబ్ల్యూస్‌‌‌‌కు సంబంధించి ఇటీవల ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈడబ్ల్యూఎస్‌‌‌‌ కోటా 100 శాతం అమలు చేస్తం. సర్టిఫికెట్‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌ సెంటర్స్‌‌‌‌ కూడా ఉన్నాయి. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఫెసిలిటీ కోసం మెయిల్‌‌‌‌, మొబైల్‌‌‌‌ నంబర్లను కూడా పెట్టాం. 

జాబ్‌‌‌‌ క్రియేటర్స్‌‌‌‌లా ఎదగాలంటే ఏం చేయాలి?
జాబ్‌‌‌‌ క్రియటర్స్‌‌‌‌గా ఎదగాలంటే ఎంటర్‌‌‌‌ ప్రిన్యూర్స్‌‌‌‌ రావాలి. ఇంటర్‌‌‌‌ స్టాయిలోనే ఈ విధంగా తయారు చేయాలి. ఈ స్కిల్స్‌‌‌‌ నేర్పాలి. ఇంటర్‌‌‌‌ ప్రిన్యర్‌‌‌‌షిప్‌‌‌‌ క్రెడిట్స్‌‌‌‌ కరిక్యులంలో చేర్చాం.

డిగ్రీలో కొత్త కోర్సులు ఏం తీసుకొస్తున్నరు.?
డిగ్రీలో బిజినెస్‌‌‌‌ ఎనలైటిక్స్‌‌‌‌, డేటా సైన్స్‌‌‌‌, హానర్స్‌‌‌‌ కోర్సులను తీసుకొచ్చినం. మిషిన్‌‌‌‌ లెర్నింగ్‌‌‌‌కు13,330  సీట్లు ఉన్నాయి. కొన్ని కాలేజీల్లో నాలుగేండ్ల బీఏ హానర్స్‌‌‌‌ కోర్సు కూడా ఆఫర్‌‌‌‌ చేస్తున్నయి. అనేక యూనివర్సిటీల్లో బెస్ట్‌‌‌‌ థీమ్ తీసుకున్నం. త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్‌‌‌‌ హబ్‌‌‌‌ కానుంది. తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి అవసరం ఉండదు. వారే ఇక్కడికి రావాల్సినపరిస్థితి వస్తుంది. వచ్చే అకడమిక్‌‌‌‌ ఇయర్‌‌‌‌లో డిగ్రీలో మరికొన్ని ఒకేషనల్‌‌‌‌ కోర్సులు ప్రవేశపెడతం.

నేషనల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ పాలసీని ఎట్ల చూస్తరు..?
నేషనల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ పాలసీని స్వాగతిస్తున్నం. ఇందు కోసం సెమినార్లు, వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లు పెట్టాం. 2035 వరకు రోడ్‌‌‌‌ మ్యాప్‌‌‌‌ ఇచ్చారు. ఇందులో ఏ సంవత్సరం ఏం చేయాలో ప్లాన్‌‌‌‌ చేస్తున్నం. ఒక బకెట్ సిస్టం తీసుకొచ్చాం. ఇది సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా నడుస్తోంది. ఈ అకడమిక్‌‌‌‌ ఇయర్‌‌‌‌లో క్లస్టర్‌‌‌‌ సిస్టంను తీసుకొస్తున్నం.