టీమిండియాను వేధిస్తున్న గాయాల బెడద

టీమిండియాను వేధిస్తున్న గాయాల బెడద

టీమిండియాను గాయాల బెడద వేధిస్తుంది. కోహ్లీ గ్యాంగ్ కు మరో జలక్ తగిలింది. పేసర్ భువనేశ్వర్ రానున్న మూడు మ్యాచ్ లకు మిస్ కానున్నాడు. పాక్ తో మాంచెస్టర్ లో జరిగిన మ్యాచ్ లో…. బౌలింగ్ చేస్తూ భువీ గాయపడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో…. రెండు ఓవర్లు వేసిన భువీ…. ఆ తర్వాత గ్రౌండ్ నుంచి వెళ్లిపోయాడు. జూన్ 22వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ తో, 27న వెస్టిండీస్ లతో జరిగే మ్యాచ్ లకు భువీ దూరం కానున్నట్లు తెలిపింది టీమ్ మేనేజ్ మెంట్.

జూన్ 30న ఇంగ్లండ్ తో జరగనున్న మ్యాచ్ కు భువీ అందుబాటులో ఉండేది లేనిది ఇప్పుడే చెప్పలేమన్నారు. అయితే ఒక వేళ స్పీడ్ బౌలర్ అవసరం అనుకుంటే… షమీ అందుబాటులో ఉన్నాడని తెలిపారు కెప్టెన్ విరాట్ కోహ్లీ. అటు ఇప్పటికే ఓపెనర్ శిఖర్ ధావన్ వేలి గాయంతో రెండు వారాలు క్రికెట్ కు దూరమైయ్యాడు.