వన్డే సిరీస్ గెలిచాక..టీమిండియా సంబరాలు

వన్డే సిరీస్ గెలిచాక..టీమిండియా సంబరాలు

ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ సమం అయినా..టీమిండియా మాత్రం టీ20, వన్డేల్లో దుమ్మురేపింది. మూడు మ్యాచ్ల  టీ20 సిరీస్ను 2-1తో దక్కించుకోగా...వన్డే సిరీస్ను 2-1తో గెలుచుకుంది. ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 260 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన భారత్..రిషబ్ పంత్ సూపర్ సెంచరీ, హార్థిక పాండ్యా హాఫ్ సెంచరీతో 42.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ఇక మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. వన్డే ట్రోఫి అందుకునే సమయంలో ప్లేయర్లు తెగ ఎంజాయ్ చేశారు. 

వన్డే సిరీస్ ట్రోఫిని ముందు కెప్టెన్ రోహిత్ శర్మ అందుకున్నాడు. అయితే ఈ సమయంలో ధావన్,  శార్దూల్ ఠాకూర్..షాంపైన్ బాటిళ్లతో రోహిత్పై స్ర్పే చేశారు. మిగిలిన ఆటగాళ్లు ధావన్, శార్దూల్కు దూరంగా పరిగెత్తారు. రోహిత్ ధావన్ను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అటు విరాట్ కోహ్లీ చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా కనిపించాడు. గ్రూప్ ఫోటో దిగేందుకు రోహిత్ అందరిని పిలిచినా..పంత్ రాలేదు.. మళ్లీ షాంపైన్ బాటిల్ తెచ్చి మరోసారి రోహిత్పై పోశాడు. చివరకు రోహిత్ శర్మ  ట్రోఫిని బౌలర్ అర్ష్ దీప్కు అందించి సంబరాలు జరుపుకున్నారు.