
అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోసం టీమిండియా ప్రాక్టీస్ స్పీడు పెంచింది. నరేంద్ర మోడీ స్టేడియంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమ్ శుక్రవారం పూర్తి స్థాయి ట్రెయినింగ్ సెషన్‌లో పాల్గొన్నది. ఫ్లడ్ లైట్స్ వెలుతురులో ప్లేయర్లంతా చెమటోడ్చారు. రోహిత్, కోహ్లీ, పంత్ నెట్స్‌లో బ్యాటింగ్ చేయగా.. స్పిన్నర్లు చహల్, కుల్దీప్, పేసర్లు సిరాజ్, దీపక్ చహర్, శార్దూల్ బౌలింగ్ చేశారు. ధవన్, రుతురాజ్, శ్రేయస్ కరోనా పాజిటివ్‌గా తేలడంతో వన్డే టీమ్‌లోకి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ప్రాక్టీస్ సెషన్‌కు అటెండ్ అయ్యాడు.