టీ20 ఓటమి నుంచి తొందరగానే తేరుకున్న టీమిండియా

టీ20 ఓటమి నుంచి తొందరగానే తేరుకున్న టీమిండియా

నాగ్‌‌పూర్‌‌: తొలి టీ20 ఓటమి నుంచి టీమిండియా తొందరగానే తేరుకుంది. టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో హిట్‌‌మ్యాన్‌‌ రోహిత్‌‌ శర్మ (20 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 నాటౌట్‌‌) కెప్టెన్‌‌ ఇన్నింగ్స్‌‌ ఆడగా, బౌలింగ్‌‌లో అక్షర్‌‌ పటేల్‌‌ (2/13) రాణించడంతో.. శుక్రవారం జరిగిన రెండో టీ20లో ఇండియా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. దీంతో మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ 1–1తో సమమైంది. తడి ఔట్‌‌ఫీల్డ్‌‌ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌‌ను 8 ఓవర్లకు కుదించారు. టాస్‌‌  ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన ఆస్ట్రేలియా 90/5 స్కోరు చేసింది. మాథ్యూ వేడ్‌‌ (20 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 నాటౌట్‌‌), ఫించ్‌‌ (15 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 31) దంచికొట్టారు. తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియా 7.2 ఓవర్లలోనే 92/4 స్కోరు చేసి గెలిచింది. రోహిత్‌‌కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ లభించింది. ఇరుజట్ల మధ్య సిరీస్‌‌ డిసైడర్‌‌ మ్యాచ్‌‌ ఆదివారం హైదరాబాద్‌‌లో జరగనుంది. 

ఫించ్‌‌, వేడ్‌‌ జోరు..

తక్కువ ఓవర్ల మ్యాచ్‌‌ కావడంతో తొలి బంతి నుంచే ఆసీస్‌‌ అటాకింగ్‌‌కు దిగింది. తొలి ఓవర్‌‌లోనే  రెండు ఫోర్లతో ఫించ్‌‌ దూకూడు చూపెట్టినా.. రెండో ఓవర్‌‌లో అక్షర్‌‌ పటేల్‌‌ వరుసగా గ్రీన్‌‌ (5), మ్యాక్స్‌‌వెల్‌‌ (0)ను ఔట్‌‌ చేశాడు. చహల్‌‌ వేసిన థర్డ్‌‌ ఓవర్‌‌లో ఫించ్‌‌ సిక్సర్‌‌తో వెల్​కమ్‌‌ చెప్పాడు. కానీ నాలుగో ఓవర్లో అక్షర్‌‌ దెబ్బకు టిమ్‌‌ డేవిడ్‌‌ (2) పెవిలియన్‌‌కు చేరాడు. అప్పటికి ఆసీస్‌‌ స్కోరు 31/3. ఈ దశలో వేడ్‌‌.. టీమిండియా బౌలింగ్‌‌ను ఉతికి ఆరేశాడు. ఐదో ఓవర్‌‌లో ఫించ్‌‌ ఔటైనా, స్మిత్‌‌ (8)తో కలిసి మెరుగ్గా ఆడాడు. ఆరో ఓవర్‌‌లో రెండు ఫోర్లు. కొట్టిన అతను ఎనిమిదో ఓవర్‌‌లో 6, 6, 6  రాబట్టడంతో  ఆసీస్‌‌ మంచి టార్గెట్‌‌ను నిర్దేశించింది. 

ఆరంభం నుంచే..

టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఓవర్‌‌కు పదికి పైగా రన్‌‌రేట్‌‌ సాధించాల్సి ఉండటంతో.. స్టార్టింగ్‌‌ ఓవర్‌‌లోనే రోహిత్‌‌ 6, 6... రాహుల్‌‌ (10) సిక్స్‌‌తో 20 రన్స్‌‌ రాబట్టారు. కమిన్స్‌‌ వేసిన సెకండ్‌‌ ఓవర్‌‌లోనూ రోహిత్‌‌ సిక్స్‌‌తో 10 రన్స్‌‌ వచ్చాయి. కానీ జంపా (3/16) రాకతో మ్యాచ్‌‌లో కాస్త ఉత్కంఠ మొదలైంది. థర్డ్‌‌ ఓవర్‌‌లో కెప్టెన్‌‌ సిక్స్‌‌ బాదినా... రాహుల్‌‌ క్లీన్‌‌ బౌల్డ్‌‌ అయ్యాడు. నాలుగో ఓవర్‌‌లో ఫోర్‌‌తో టచ్‌‌లోకి వచ్చిన కోహ్లీ (11)ని, సూర్యకుమార్‌‌ (0)ను  తన తర్వాతి ఓవర్లో జంపా పెవిలియన్‌‌కు పంపాడు. దీంతో ఇండియా 55/3తో నిలిచింది. కానీ,  ఆరో ఓవర్‌‌లో రోహిత్‌‌ 4, 4 బాదాడు. చివరి రెండు ఓవర్లలో 23 రన్స్‌‌ అవసరం అయ్యాయి. ఏడో ఓవర్లో పాండ్యా (9) ఫోర్‌‌ కొట్టి ఔటైనా..  రోహిత్‌‌ క్లాసీ కట్‌‌ షాట్‌‌తో బౌండ్రీతో 13  రన్స్‌‌ వచ్చాయి.   కార్తీక్‌‌ (10 నాటౌట్‌‌) 6, 4తో మ్యాచ్​ను ఫినిష్ చేశాడు. ​

సంక్షిప్త స్కోర్లు

ఆస్ట్రేలియా: 8 ఓవర్లలో 90/5 (వేడ్‌‌ 43 నాటౌట్‌‌, ఫించ్‌‌ 31, అక్షర్‌‌ 2/13), ఇండియా: 7.2 ఓవర్లలో 92/4 (రోహిత్‌‌ 46 నాటౌట్‌‌, జంపా 3/16).