వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌ కోసం ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్

వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌ కోసం ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్

ముంబై: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌ కోసం టీమిండియా బుధవారం వాంఖడేలో ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ షురూ చేసింది. స్టాండిన్​ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యాతో పాటు కొంత మంది ప్లేయర్లు రెండు గంటల పాటు నెట్స్‌‌‌‌‌‌‌‌లో తీవ్రంగా చెమటోడ్చారు. పేసర్లు సిరాజ్‌‌‌‌‌‌‌‌, ఉనాద్కట్‌‌‌‌‌‌‌‌, ఉమ్రాన్‌‌‌‌‌‌‌‌, శార్దూల్‌‌‌‌‌‌‌‌ తో పాటు సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌, ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్నారు.

బావమరిది పెండ్లి కారణంగా కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ తొలి వన్డేకు దూరంగా ఉండనున్నాడు. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌, బౌలింగ్‌‌‌‌‌‌‌‌, ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌లు విక్రమ్‌‌‌‌‌‌‌‌ రాథోడ్‌‌‌‌‌‌‌‌, దిలీప్‌‌‌‌‌‌‌‌, పారస్‌‌‌‌‌‌‌‌ మాంబ్రే ఈ సెషన్‌‌‌‌‌‌‌‌ను పర్యవేక్షించారు. మొత్తం సెషన్‌‌‌‌‌‌‌‌లో రిస్ట్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్లు కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌, యజ్వేంద్ర చహల్‌‌‌‌‌‌‌‌పై ఎక్కువగా ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టారు. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌ సుందర్‌‌‌‌‌‌‌‌ కూడా టీమ్‌‌‌‌‌‌‌‌లో ఉండటంతో ఈ ‘కుల్చా’ జోడీపై ఒత్తిడి నెలకొంది. తొలి వన్డే ముంబైలో శుక్రవారం జరగనుంది.