
ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ ఛటేశ్వర పూజారా సిద్ధమవుతున్నాడు. ఈ సిరీస్లో భారత్కు ప్రతిష్టాత్మకం కానుంది. సిరీస్ గెలిస్తే భారత్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తు ఖాయం కానుంది. ఈ నేపథ్యంలో పూజారా అప్పుడే ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. తన ప్రాక్టీస్ కు సంబంధించిన ఫోటోలను ట్వి్ట్టర్ లో షేర్ చేశాడు. గెటింగ్ రెడీ ఫర్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అనే క్యాప్షన్ ఇచ్చాడు.
భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. ఇరు జట్లు నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో పాల్గొననున్నాయి. మరోవైపు ఈ టెస్ట్ సిరీస్ లో పూజారా కీలకం కానున్నాడు. గతేడాది పూజారా ఐదు టెస్టుల్లో 45.44 సగటుతో 409 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలున్నాయి.
బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన 6వ బ్యాట్స్మన్ పూజారా. ఇప్పటివరకు 20 మ్యాచ్‌లు, 37 ఇన్నింగ్స్ ఆడిన పుజారా.. 54.08 సగటుతో 1,893 పరుగులు సాధించాడు. ఇందులో 5 సెంచరీలు, 10 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 204 పరుగులు.