ముంబై: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం టీమిండియా.. జులైలో జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ మేరకు ఈ టూర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం బీసీసీఐ విడుదల చేసింది. జులై 23, 25,26 తేదీల్లో హరారే స్పోర్ట్స్ క్లబ్ ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇండియా టీమ్ పాల్గొంటున్న తొలి ఇంటర్నేషనల్ సిరీస్ ఇది.
ఇక 2026–27 సీజన్‌లో ఇండియా–జింబాబ్వే మధ్య జరగనున్న రెండు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఇది మొదటిది. టీ20 సిరీస్ తర్వాత వచ్చే ఏడాది జనవరిలో జింబాబ్వే టీమ్.. ఇండియాకు రానుంది. . జనవరి 3, 6, 9 తేదీల్లో వరుసగా కోల్‌కతా, హైదరాబాద్, ముంబైలో మూడు వన్డేలు జరగనున్నాయి. 2024లో జింబాబ్వే టూర్‌కు వెళ్లిన టీమిండియా.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది.
