చరిత్ర సృష్టించిన భారత్.. అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్

చరిత్ర సృష్టించిన  భారత్.. అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్

టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో గ్రాండ్ విక్టరీతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.  116 పాయింట్లతో వన్డేల్లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. వన్డేల్లో టాప్ లో ఉన్న పాకిస్తాన్ ని వెనక్కి నెట్టి నెంబర్ వన్ గా నిలిచింది.

ఇప్పటికే  టీమిండియా  118 పాయింట్లతో టెస్టుల్లో.. 264 పాయింట్లతో టీ20ల్లో అగ్రస్థానంలో ఉంది.  ఇపుడు   అన్ని ఫార్మాట్లలో  ఈ ఘనత సాధించిన జట్టుగా భారత్ రికార్డ్ సృష్టించింది.

ఐసీసీ వన్డే బ్యాటింగ్ లో సెకండ్ ప్లేస్ లో  శుబ్ మన్ గిల్.. బౌలింగ్ లో నెంబర్ వన్ స్థానంలో  సిరాజ్ ఉన్నాడు. టీ 20 బ్యాటింగ్ లో నెంబర్ వన్ ర్యాంక్ లో సూర్యకుమార్ యాదవ్. టెస్టుల్లో  నెంబర్ వన్ బౌలర్ గా అశ్విన్...నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా  రవీంద్ర జడేజా ఉన్నారు.