ఎదురేలేదు .. వరల్డ్ కప్​ లీగ్‌‌‌‌ దశలో అజేయంగా ఇండియా

ఎదురేలేదు .. వరల్డ్ కప్​ లీగ్‌‌‌‌ దశలో అజేయంగా ఇండియా
  • 160 రన్స్‌‌‌‌తో నెదర్లాండ్స్‌‌‌‌పై విక్టరీ
  • సెంచరీలతో దంచిన రాహుల్, అయ్యర్
  • రేపు న్యూజిలాండ్‌‌‌‌తో సెమీస్‌‌‌‌

బెంగళూరు: ‘మిషన్​వన్డే వరల్డ్ కప్‌ 2023’ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసేందుకు టీమిండియా మరో రెండు అడుగుల దూరంలో  నిలిచింది. లీగ్‌‌‌‌‌‌‌‌ దశను అజేయంగా ముగించింది. మెగా టోర్నీలో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ఇండియన్‌‌‌‌‌‌‌‌గా  కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్ (64 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 102) రికార్డు, శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్ (94 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 128) సెంచరీకి తోడు బ్యాటింగ్ సూపర్ స్టార్స్‌‌‌‌‌‌‌‌ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ మ్యాజిక్‌‌‌‌‌‌‌‌ చేసిన వేళ ఆదివారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా 160 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. 

18 పాయింట్లతో టేబుల్‌‌‌‌‌‌‌‌ టాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. ఈ పోరులో తొలుత ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 410/4 స్కోరు చేసింది. రోహిత్​ (61), గిల్ (51), కోహ్లీ (51) ఫిఫ్టీలు కొట్టారు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో డచ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ 47.5 ఓవర్లలో 250 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. తెలుగు ఆటగాడు తేజ నిడమనూరు (54), సైబ్రండ్ (45) రాణించారు. బుమ్రా, సిరాజ్, కుల్దీప్ తలో మూడు, కోహ్లీ, రోహిత్ ఒక్కో వికెట్ పడగొట్టారు. శ్రేయస్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బుధవారం వాంఖడే స్టేడియంలో జరిగే సెమీస్‌లో న్యూజిలాండ్‌తో ఇండియా తలపడనుంది. 

దివాళీ ధమాకా 

దీపావళి పండుగ వేళ టాస్‌‌‌‌‌‌‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన టీమిండియా  స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌ను నుంచి ఎండింగ్ వరకు ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ను అలరించింది. తొలుత ఓపెనర్లు రోహిత్, గిల్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేను సద్వినియోగం చేసుకొని ఈజీగా ఫోర్లు, సిక్సర్లు కొట్టారు. దాంతో 12 ఓవర్లకే స్కోరు వంద దాటింది. అదే ఓవర్లో మరో షాట్‌‌‌‌‌‌‌‌కు ట్రై చేసిన గిల్ క్యాచ్ ఇవ్వగా.. ఫిఫ్టీ పూర్తి చేసుకున్న రోహిత్ కాసేపటికే డి లీడే బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఔటయ్యాడు. కొత్తగా క్రీజులోకి వచ్చిన కోహ్లీ, అయ్యర్ కూడా అదే జోరు కొనసాగించారు.  మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు ఇద్దరూ 71 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించారు. 

ఈ క్రమంలో 53 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ దాటిన కోహ్లీ తన 50వ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ, మెర్వే ఫ్లాట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌తో అతడిని బౌల్డ్‌‌‌‌‌‌‌‌ చేసి డచ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు మరో బ్రేక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తోడైన కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్ తన హోమ్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఇద్దరూ భారీ షాట్లతో వరుస పెట్టి బౌండ్రీల వర్షం కురిపించడంతో 41 ఓవర్లకు స్కోరు 300 దాటింది. 

స్లాగ్ ఓవర్లలో వీళ్లు మరింత రెచ్చిపోయారు.  మీకెరెన్ వేసిన 44వ ఓవర్లో చెరో సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టారు. 84 బాల్స్‌‌‌‌‌‌‌‌లో వంద దాటిన అయ్యర్.. వాన్ బీక్‌‌‌‌‌‌‌‌ వేసిన 49వ ఓవర్లో 3సిక్సర్లు, ఓ ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఏకంగా 25 రన్స్‌‌‌‌‌‌‌‌ పిండుకున్నాడు. ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన కేఎల్‌‌‌‌‌‌‌‌ కూడా ఈ టోర్నీలో తొలి సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు స్కోరు 400 దాటించాడు. ఐదో బాల్‌‌‌‌‌‌‌‌కు అతను ఔటవడంతో నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 208 రన్స్ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది.

తొమ్మిది మందితో బౌలింగ్‌‌‌‌‌‌‌‌

భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో  డచ్‌‌‌‌‌‌‌‌ టీమ్ ఇండియాకు పోటీ ఇవ్వలేకపోయింది. కెప్టెన్ రోహిత్ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఏకంగా తొమ్మిది మందితో బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేయించాడు. చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ను ఖుషీ చేయడంతో పాటు మెయిన్‌‌‌‌‌‌‌‌  బౌలర్లపై కాస్త పనిభారం తగ్గించాడు.  ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సిరాజ్ రెండో ఓవర్లోనే ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బరెసి (4)ని ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి డచ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ పతనాన్ని ఆరంభించాడు. రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 61 రన్స్ జోడించిన ఒడౌడ్ (30), అకెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్  (35) కాసేపు పోరాడారు. అకెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన కుల్దీప్ ఈ జోడీని విడదీయగా.. తన ఫస్ట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌కే  ఒడౌడ్‌‌‌‌‌‌‌‌ను జడేజా పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చాడు. 

ఇక ఫ్యాన్స్ కేరింతల నడుమ తొలి పార్ట్‌‌‌‌‌‌‌‌టైమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 23 ఓవర్లో కోహ్లీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు దిగాడు.  అతని తర్వాతి ఓవర్లోనే లెగ్‌‌‌‌‌‌‌‌ సైడ్ బాల్‌‌‌‌‌‌‌‌ను వెంటాడిన డచ్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ స్కాట్ ఎడ్వర్డ్స్ (17) కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. దాంతో కోహ్లీ ఓ వికెట్‌‌‌‌‌‌‌‌ ఖాతాలో వేసుకోగా.. స్టేడియం మొత్తం దద్దరిల్లింది. తర్వాత ఓపెనర్ గిల్, సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా రోహిత్ బంతి ఇచ్చాడు.  మధ్యలో  డీ లీడే (12)ను బుమ్రా, సైబ్రండ్‌‌‌‌‌‌‌‌ను సిరాజ్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌ చేశారు.  కుల్దీప్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో వాన్ బీక్ (16), జడేజా ఓవర్లో మెర్వే (16) పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేరారు. వరుసగా వికెట్లు పడ్డా మరో ఎండ్‌‌‌‌‌‌‌‌లో ఆకట్టుకున్న తేజ.. రోహిత్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సిక్స్‌‌‌‌‌‌‌‌తో ఫిఫ్టీ చేసుకున్నాడు. తర్వాతి బాల్‌‌‌‌‌‌‌‌కే అతడిని ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ డచ్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను ముగించాడు.