
వెల్లింగ్టన్: ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్ ముగిసిన వెంటనే టీమిండియా.. న్యూజిలాండ్ టూర్ కు వెళ్తుంది. ఈ టూర్‌లో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేల్లో కివీస్‌తో తలపడుతుంది. నవంబర్ 18-30 మధ్య ఈ సిరీస్‌లు జరుగతాయని న్యూజిలాండ్ క్రికెట్ మంగళవారం ప్రకటించింది. నవంబర్ 18, 20, 22వ తేదీల్లో వరుసగా వెల్లింగ్టన్, మౌంట్ మాంగనీ, నేపియర్‌లో మూడు టీ20లు జరుగుతాయని వెల్లడించింది. అదే నెల 25, 27, 30వ తేదీల్లో ఆక్లాండ్, హామిల్టన్, క్రైస్ట్‌చర్చ్‌లో మూడు వన్డేలను షెడ్యూల్ చేసినట్లు తెలిపింది. అలాగే, వైట్ బాల్ సిరీస్ కోసం కివీస్ జట్టు.. వచ్చే ఏడాది జనవరిలో ఇండియా టూర్‌కు వస్తుందని ప్రకటించింది.