టీ20 వరల్డ్ కప్ టీమ్ ఎంపిక పెద్ద సవాలే

టీ20 వరల్డ్ కప్ టీమ్ ఎంపిక పెద్ద సవాలే
  • టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌ ప్లాన్స్​ నుంచి సుందర్​ ను తీసేసిన సెలెక్టర్లు! 

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. టీమిండియాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. మెగా ఈవెంట్‌‌‌‌కు బలమైన టీమ్‌‌‌‌ను బరిలోకి దించాలని భావిస్తున్నా.. యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌ నుంచి సెలెక్టర్లకు  పెద్ద సవాలే ఎదురవుతున్నది. ఈ మధ్య కాలంలో సీనియర్లు లేకపోయినా.. యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌తో కూడిన టీమిండియా వరుసగా సిరీస్‌‌‌‌లు గెలిచింది. దీంతో ఆసీస్‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌లో ఎవరికి బెర్త్‌‌‌‌ కేటాయించాలన్న దానిపై సెలెక్షన్‌‌‌‌ కమిటీ ఓ కొలిక్కి రాలేకపోతున్నది. తాజాగా ఆసియా కప్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌తో దీనిపై తుది నిర్ణయానికి రావాలని సెలెక్టర్లు  భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెలెక్టర్ల నుంచి ఒకటి, రెండు స్పష్టమైన సంకేతాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా  స్పిన్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌గా పనికి వస్తాడనుకున్న వాషింగ్టన్‌‌‌‌ సుందర్‌‌‌‌ను.. టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ టీమ్‌‌‌‌ ప్రణాళికల నుంచి తప్పించాలని సెలెక్టర్లు నిర్ణయానికి వచ్చేశారు.

అదే సమయంలో వెటరన్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ అశ్విన్‌‌‌‌కు ఆసీస్‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌లో చోటు కల్పించాలని భావిస్తున్నారు. ‘సుందర్‌‌‌‌ టీమిండియాకు చాలా గొప్ప ఆస్తి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ను మెరుగుపర్చుకోవాలి. అవకాశం కోసం వెయిట్‌‌‌‌ చేయాల్సిందే. ఈ విషయాన్ని సుందర్‌‌‌‌తో చర్చించాం. ఆసీస్‌‌‌‌ పిచ్‌‌‌‌లకు అశ్విన్‌‌‌‌ సరిపోతాడని అనుకుంటున్నాం. ఒకవేళ ఎవరైనా గాయపడితే అప్పుడు సుందర్‌‌‌‌ బ్యాకప్‌‌‌‌గా వస్తాడు’ అని ఓ సెలెక్టర్‌‌‌‌ వ్యాఖ్యానించాడు. గాయం కారణంగా చాలా రోజులుగా ఇంటర్నేషనల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌కు దూరంగా ఉన్న సుందర్‌‌‌‌.. ఇటీవలే కౌంటీల్లో సూపర్‌‌‌‌ ఎంట్రీ ఇచ్చాడు. లాంక్​షైర్‌‌‌‌ తరఫున రెండు ఫస్ట్‌‌‌‌ క్లాస్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో 8 వికెట్లు తీశాడు.   మొత్తానికి ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ లేకపోవడం, ఐపీఎల్‌‌‌‌ తర్వాత ఇంటర్నేషనల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు ఆడకపోవడం, టీమ్‌‌‌‌లో పోటీ పెరగడం, ఆసీస్‌‌‌‌ పిచ్‌‌‌‌లు అతని బౌలింగ్‌‌‌‌కు సరిపోకపోవడం వంటి నాలుగు అంశాలతో సెలెక్టర్లు సుందర్‌‌‌‌ను పక్కనబెట్టారు. 

స్పిన్‌‌‌‌ వెరైటీ కోసమే..
టీమిండియాలో స్పిన్నర్‌‌‌‌గా అశ్విన్‌‌‌‌కు చాలా అనుభవం ఉంది. ఆసీస్‌‌‌‌ పిచ్‌‌‌‌లు ఎక్కువగా పేసర్లకు సహకరిస్తాయి. అదే సమయంలో అశ్విన్‌‌‌‌ స్పిన్‌‌‌‌ కూడా ప్రభావవంతంగా పని చేస్తుందని సెలెక్టర్లు నమ్ముతున్నారు. జడేజా, చహల్‌‌‌‌ను తీసుకున్నా.. అశ్విన్‌‌‌‌ టీమ్‌‌‌‌లో ఉండటం వల్ల స్పిన్​లో వైవిధ్యం ఉంటుందని భావిస్తున్నారు. అనుభవం పక్కనబెడితే మ్యాచ్‌‌‌‌ను అవగాహన చేసుకోవడంలో అశ్విన్​ దిట్ట. దీనికి తోడు డిఫరెంట్‌‌‌‌ బాల్స్‌‌‌‌ వేయడంలో స్పెషలిస్ట్‌‌‌‌. ఆసీస్‌‌‌‌ పిచ్‌‌‌‌లపై బాల్‌‌‌‌ టర్నింగ్‌‌‌‌ లేకపోయినా.. మంచి వేరియేషన్స్‌‌‌‌తో బ్యాటర్లను ఇబ్బందిపెడతాడని యోచిస్తున్నారు. అదే సమయంలో యంగ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ రవి బిష్ణోయ్‌‌‌‌ నుంచి అశ్విన్‌‌‌‌కు పోటీ ఎదురయ్యే చాన్స్‌‌‌‌ కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో  ఆసియా కప్‌‌‌‌లో ఈ ఇద్దరి  ఆటను సెలెక్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు.