ఒకే ఫ్లైట్​లో టీమిండియా మెన్స్, విమెన్స్​ ప్లేయర్లు

ఒకే ఫ్లైట్​లో టీమిండియా మెన్స్, విమెన్స్​ ప్లేయర్లు
  • రెండు జట్లు.. ఒకే ఫ్లైట్​లో
  • ఇంగ్లండ్​కు టీమిండియా మెన్స్, విమెన్స్​ ప్లేయర్లు

న్యూఢిల్లీ: ఇండియన్​ క్రికెట్ హిస్టరీలోనే తొలిసారి మెన్స్, విమెన్స్​ జట్లు కలిసి ఒకే ఫ్లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రయాణం చేయనున్నాయి. వరల్డ్​టెస్ట్ చాంపియన్​షిప్ ఫైనల్‌‌‌‌‌‌‌‌ కోసం విరాట్​సేన యూకే వెళ్తుండగా, మిథాలీ రాజ్​ నేతృత్వంలోని విమెన్స్​ టీమ్​.. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో ఓ టెస్ట్‌‌‌‌‌‌‌‌(నాలుగు రోజుల మ్యాచ్‌‌‌‌‌‌‌‌), మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు అక్కడికి వెళ్తున్నది. దీంతో జూన్​2న ముంబై నుంచి రెండు టీమ్​లు ఒకే ఫ్లైట్​లో ప్రయాణం చేసేలా బీసీసీఐ ప్లాన్ చేసింది. ‘మమ్ముల్ని ఈ నెల19న ముంబైకి రమ్మన్నారు. హార్డ్​ క్వారంటైన్​ తర్వాత మా ప్రయాణం మొదలవుతుంది. ఫ్లైట్‌‌‌‌‌‌‌‌లో మాతో విమెన్స్​ క్రికెటర్లు కూడా ఉంటారు’ అని టీమిండియా ప్లేయర్ ఒకరు వెల్లడించాడు. ఇంగ్లండ్​ చేరిన తర్వాత రెండు జట్లు వారం రోజులు ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌లో ఉంటాయి. ఆ తర్వాతి నుంచి ట్రెయినింగ్​లో పాల్గొంటాయి. ఈ టూర్​లో పాల్గొనే ప్రతి ఒక్కరి కోసం బోర్డు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది. ప్రతీ క్రికెటర్‌‌‌‌‌‌‌‌తో పాటు ఫ్యామిలీకి కూడా ఇంటి వద్దే ఆర్టీపీసీఆర్​ టెస్ట్​లు చేయిస్తోంది. ఆ రిజల్ట్స్​ను బట్టి ప్లేయర్లను ముంబైలోని క్వారంటైన్​లోకి అనుమతిస్తుంది. అయితే కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, వైస్​ కెప్టెన్​ అజింక్యా రహానెతో పాటు ​ రోహిత్​ శర్మకు క్వారంటైన్​ నుంచి మినహాయింపు ఇచ్చింది. వీళ్లందరూ ముంబైలోనే ఉంటుండటంతో.. హోమ్ ఐసోలేషన్​కు చాన్స్​​ ఇచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత టీమిండియా.. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది.

జూన్​ 16 నుంచి పొవార్​ ఫస్ట్​ అసైన్​మెంట్​
ఇక విమెన్స్​ క్రికెట్​ విషయానికొస్తే.. కొత్త  కోచ్​గా బాధ్యతలు స్వీకరించనున్న  రమేశ్​ పొవార్​.. ఫస్ట్​ అసైన్​మెంట్​ జూన్​ 16 నుంచి మొదలుకానుంది. మిథాలీ నేతృత్వంలోని టీమిండియా.. హీథర్​ నైట్​ సారథ్యంలో ఇంగ్లండ్​తో ఏకైక టెస్ట్​ మ్యాచ్​ ఆడుతుంది. ఆ తర్వాత ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరుగుతాయి. వన్డేలకు మిథాలీ, టీ20లకు హర్మన్​ప్రీత్​ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.