
‘ఆర్ఆర్‌ఆర్’తో గ్లోబల్ లెవల్‌లో గుర్తింపును తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. వాటిలో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న ‘వార్2’ ఒకటి. ఈ చిత్రంతో తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. మంగళవారం (మే 21) ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
‘వార్’ సీక్వెల్‌గా రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఉండగా, వాటికి ఏమాత్రం తగ్గకుండా కంప్లీట్ యాక్షన్ సీన్స్‌తో టీజర్‌ను కట్ చేసిన తీరు ఇంప్రెస్ చేస్తోంది. ‘నా కళ్లు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతున్నాయి కబీర్.. ఇండియాలో బెస్ట్ సోల్జర్, రా లో బెస్ట్ ఏజెంట్.. నువ్వే.. కానీ ఇప్పుడు కాదు.. నీకు నా గురించి తెలీదు.. ఇప్పుడు తెలుసుకుంటావ్.. గెట్ రెడీ ఫర్ వార్’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది.
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఢీ అంటే ఢీ అనేలా చేసిన పోరాట సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. చేజింగ్ సీన్లు, భారీ యాక్షన్ స్టంట్స్‌తో ఉన్న టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఎన్టీఆర్ న్యూ లుక్, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులకు విజువల్ ట్రీట్ ఇచ్చేలా ఉన్నాయి. ఇక హృతిక్ రోషన్‌కు జంటగా నటించిన కియారా అద్వానీ బికినీలో కనిపించి మెస్మరైజ్ చేసింది.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 14న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.