ఆకాశంలో అప్డేట్ ఇచ్చిన నాని.. వైరలవుతున్న వీడియో

ఆకాశంలో అప్డేట్ ఇచ్చిన నాని.. వైరలవుతున్న వీడియో

నేచురల్ స్టార్ నాని హీరోగా కొత్త దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సీతా రామమ్ ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నుండి తాజాగా అప్డేట్ ఇచ్చారు హీరో నాని. అది కూడా గాలిలో ఎగురుతూ. 

అవును ఆకాశాలలో ప్యారాగ్లైడింగ్ చేస్తూ తన నెక్స్ట్ సినిమాకి సంబందించిన అప్డేట్ ఇచ్చారు నాని. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను సంబందించిన.. టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ ను జులై 13న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. 

ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాకు.. మలయాళ మ్యూజిక్ సెన్సేషన్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 21న క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రీసెంట్ గా దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని.. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటడానికి వస్తున్నారు. మరి ఈ సినిమా నానీ కెరీర్ కి ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.