
హైదరాబాద్: సికింద్రాబాద్ నార్త్ జోన్ గోపాల్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. టెక్ మహేంద్ర కాల్ సెంటర్‌లో సుస్మిత(18)అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఉప్పార బస్తీకి చెందిన సుస్మిత ఇటీవలే కంపెనీలో ట్రైనింగ్ పూర్తి చేసుకుంది. అయితే వందలాది మంది పని చేసే షిఫ్ట్‌లో 6వ అంతస్తు పైనుంచి దూకి ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతుంది. సుస్మిత ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుంచి ఉదయం ఆఫీసుకి వచ్చిందని.. ఆ తరువాత ఏం జరిగిందో తమకు తెలియదని తల్లిదండ్రులు గోవింద్ రాజు, శీల చెబుతున్నారు. తమకు ఎలాంటి ఆర్థిక సమస్యలూ లేవని వెల్లడించారు. తమ కుమార్తె ఆత్మహత్యపై అనుమానాలున్నాయని పేర్కొన్నారు.