V6 News

16 శాతం పెరిగిన టెక్ మహీంద్రా లాభం.. నాలుగో క్వార్టర్లో రూ.13వందల53 కోట్లు

16 శాతం పెరిగిన టెక్ మహీంద్రా లాభం.. నాలుగో క్వార్టర్లో  రూ.13వందల53 కోట్లు
  • రూ.36 చొప్పున డివిడెండ్

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ లో రూ.1,353.8 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్ తో పోలిస్తే ఇది 16 శాతం వృద్ధి. కార్యకలాపాల ఆదాయం 12.6 శాతం పెరిగి రూ.15,076.1 కోట్లుగా నమోదైంది. 2026 ఆర్థిక సంవత్సరం మొత్తానికి లాభం 13.15 శాతం పెరిగి రూ.4,810.9 కోట్లకు చేరింది.  2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 3,794 మిలియన్ డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలను దక్కించుకుంది. ఏఐ  ఐటీ రంగానికి ముప్పు కాదని, అది వ్యాపార వృద్ధికి గొప్ప అవకాశమని కంపెనీ సీఈఓ మోహిత్ జోషి పేర్కొన్నారు.