సర్కారు స్కూళ్లలో మూలనపడ్డ టెక్నికల్​ ఎడ్యుకేషన్​

సర్కారు స్కూళ్లలో మూలనపడ్డ టెక్నికల్​ ఎడ్యుకేషన్​
  • పదేళ్ల నుంచి స్టూడెంట్లకు అందని టెక్నికల్​ఎడ్యుకేషన్​
  • ఇన్ స్ట్రక్టర్లను నియమించని ఆఫీసర్లు

ఆసిఫాబాద్,వెలుగు: ఏజెన్సీలో కంప్యూటర్​విద్య అటకెక్కింది. కార్పొరేట్​స్కూళ్లకు దీటుగా విద్యార్థులకు ఎడ్యుకేషన్​అందించాలనే ప్రభుత్వ సంకల్పం నీరుగారింది. గవర్నమెంట్ స్కూళ్ల విద్యార్థులకు టెక్నికల్​ఎడ్యుకేషన్​అందించాలనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2002 కంప్యూటర్​విద్య ప్రారంభించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్​జిల్లాలోని ఒక్కో స్కూలుకు 11 చొప్పున 84 స్కూళ్లకు కంప్యూటర్లు అందజేశారు. బోధన సిబ్బందిని ప్రైవేట్​ఏజెన్సీకి అప్పగించారు. సుమారు ఐదేళ్ల పాటు పనిచేసిన సిబ్బంది కాంట్రాక్ట్​ పూర్తికావడంతో చదువు చెప్పడం మానేశారు. ప్రభుత్వం కొత్తగా సిబ్బందిని నియమించకపోవడంతో పేద విద్యార్థులకు సాంకేతిక విద్య దూరమైంది. కంప్యూటర్లు మూలనపడ్డాయి.

కోట్ల రూపాయలు వృధా...

గవర్నమెంట్ స్కూల్ లలో పంపిణీ చేసిన కంప్యూటర్లు మూలనపడడంతో సుమారు రూ. 3.31 కోట్లు వృధాగా మారాయి. ఒక్కో జడ్పీ ఉన్నత పాఠశాలకు 11 మానిటర్లు, రెండు సీపీయూలు, జనరేటర్, 20 కుర్చీలు, టేబుళ్లు, మ్యాట్, విద్యుత్ సౌకర్యం ఇలా కార్పొరేట్ స్దాయిలో అన్ని హంగులతో ల్యాబ్ లు ఏర్పాటు చేశారు. ఇదంతా ముణ్నాళ్ల ముచ్చటైంది. చదువు చెప్పే స్టాఫ్​లేకపోవడంతో కోట్లు 
వృధా అయ్యాయి.

పనిచేయడం లేదు

గతంలో గవర్నమెంట్ ఇచ్చిన కంప్యూటర్లు చాలాచోట్ల పనిచేయడంలేదు. ‘మన ఊరు.. మన బడి’ ప్రోగ్రామ్​అయిపోయాక దీని గురించి గవర్నమెంట్​కు నివేదిక ఇస్తాం. ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం.  

- అశోక్, డీఈవో