
రాఘవ లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన ఈ చిత్రాన్ని పోస్ట్‌పోన్ చేస్తున్నామని ప్రకటిస్తూ, కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు.
సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ ఉప్పుటూరి, వెంకటరత్నం శాఖమూరి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. మరోవైపు ఈనెల 11న తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు.