టెక్నాలజీ: డ్రీమ్స్‌‌ హ్యాక్ చేయెచ్చు!

టెక్నాలజీ: డ్రీమ్స్‌‌ హ్యాక్ చేయెచ్చు!

ఛార్జింగ్ రూమ్

ఏదైనా డివైజ్‌‌ను ఛార్జింగ్​ చేయాలంటే ముందుగా పవర్ సాకెట్ ఎక్కడుందో వెతకాలి. రూమ్‌‌లో పవర్ సాకెట్ లేకపోయినా లేదా అడాప్టర్ లేకపోయినా ఛార్జింగ్​ చేయడం కష్టం. చివరికి వైర్‌‌‌‌లెస్ ఛార్జర్‌‌‌‌ను కూడా ముందుగా కేబుల్‌‌తోనే ఛార్జింగ్​ చేయాల్సి ఉంటుంది. అయితే ఫ్యూచర్‌‌‌‌లో రాబోయే ‘పవర్డ్ రూమ్స్’ టెక్నాలజీతో నిజమైన వైర్‌‌‌‌లెస్ ఛార్జింగ్‌‌ను ఎక్స్‌‌పీరియెన్స్ చేయొచ్చు. 

పవర్డ్‌‌ రూమ్స్‌‌లో రూమ్ అంతా పవర్‌‌‌‌తో నిండి ఉంటుంది. రూమ్‌‌లో ఎక్కడ మొబైల్ పెట్టినా.. ఆటోమేటిక్‌‌గా ఛార్జింగ్ అవుతుంది. రూమ్ అంతా వైర్‌‌‌‌లెస్ ఛార్జర్‌‌‌‌లా పనిచేసే టెక్నాలజీ ఇది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండే మెటల్ కాయిల్  ద్వారా గాల్లో కరెంట్ పాస్ అయ్యేలా చేస్తుంది ఈ కొత్త టెక్నాలజీ.

గాలి లేని టైర్లు

కారు, బైక్.. వాహనం ఏదైనా అది నడవాలంటే పెట్రోల్‌‌తో పాటు టైర్‌‌‌‌లో గాలి కూడా ఉండాలి. ఎయిర్ ప్రెజర్ లేకుండా బండి ముందుకు కదల్లేదు. అందుకే టైర్లతో ఇబ్బంది లేకుండా ఉండేందుకు కార్లలో స్టెఫినీ టైర్లు ఇస్తుంటాయి కంపెనీలు. అయితే ఫ్యూచర్‌‌‌‌లో స్టెఫినీల అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే గాలి లేని టైర్ల తయారీ ఆల్రెడీ మొదలైపోయింది. గ్లాస్ ఫైబర్, ప్లాస్టిక్, అల్యూమినియంతో తయారయ్యే కొత్త రకం టైర్లు ఫ్యూచర్‌‌‌‌లో రాబోతున్నాయి. ఇవి గాలితో పనిలేకుండా కొద్దిపాటి స్ప్రింగ్ యాక్షన్‌‌తో బండి తేలిగ్గా కదిలేలా చేస్తాయి. ఈ టైర్లు అందుబాటులోకి వస్తే.. జర్నీ మధ్యలో టైర్లలో గాలి తగ్గడం, పంక్చర్లు అవ్వడం లాంటి ఇబ్బందులుండవు.

డ్రీమ్ హ్యాకింగ్

నిద్రలో వచ్చే డ్రీమ్స్ చాలా ప్రత్యేకం. వాటిని గనుక హ్యాక్ చేయగలిగితే.. చాలా ప్రాబ్లమ్స్‌‌ సాల్వ్ చేయొచ్చు. ఫ్యూచర్‌‌‌‌లో ఇలాంటి టెక్నాలజీనే తీసుకురాబోతున్నారు సైంటిస్టులు. ఒంటికి ధరించే కొన్ని వేరబుల్ ప్రొడక్ట్స్‌‌ ద్వారా కలలో వచ్చే విషయాలను హ్యాక్ చేసే టెక్నాలజీ ఫ్యూచర్‌‌‌‌లో రానుంది. దీని ద్వారా కలలో వచ్చిన విషయాలను మర్చిపోకుండా తిరిగి నెమరువేసుకోవచ్చు. అలాగే 

పీడ కలలు రాకుండా ముందుగానే ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. నిద్రలో ఉన్నప్పుడు కూడా మెదడు కొన్ని విషయాలు నేర్చుకునేలా సెట్ చేసుకోవచ్చు. డ్రీమ్స్ రాకుండా కంట్రోల్ చేయొచ్చు. స్లీప్ క్వాలిటీ పెంచుకోవచ్చు. ఈ టెక్నాలజీ సాయంతో చివరికి డ్రీమ్స్‌‌లో కూడా అడ్వర్టైజ్​ చేయాలని ప్లాన్ చేస్తున్నాయట కొన్ని కంపెనీలు. అయితే ప్రస్తుతం ఇది డెవలపింగ్ స్టేజ్‌‌లో ఉంది. ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చూడాలి.

హైపర్ వార్స్

ఒకప్పుడు యుద్ధాలంటే బాణాలు, గుర్రాలు లాంటివి గుర్తొచ్చేవి. ఇప్పుడు మిసైల్స్, వార్ ట్యాంక్స్ లాంటివి వాడుతున్నారు. అయితే ఇక ముందు జరిగే యుద్ధాల్లో ఏఐ(ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్) పాత్ర చాలానే ఉంటుంది అంటున్నారు సైంటిస్టులు. యుద్ధ రంగంలో కూడా ఏఐ ఎంట్రీ ఇస్తుందట. ఏఐ సాయంతో చేసే యుద్ధాలను ‘హైపర్ వార్స్’ అంటారు. యుద్ధం కోసం వేసే 

ప్లాన్స్, వెపన్స్ అన్నింటినీ ఏఐ కంట్రోల్ చేస్తుంది. దీనికోసం దేశాలు రకరకాల ఏఐ మోడల్స్‌‌ను రెడీ చేసుకుంటాయి. ఆయా దేశాల దగ్గర ఉన్న వెపన్స్, భౌగోళిక పరిస్థితులను బట్టి ఏఐనే వార్ స్ట్రాటజీ రూపొందిస్తుంది. అవసరమైతే రోబోలే రంగంలోకి దిగుతాయి. దేశాల దగ్గర ఉన్న డబ్బు, టెక్నాలజీని బట్టి రోబో ఆర్మీలు కూడా తయారవుతాయి. అయితే ఇలాంటి హైపర్ వార్స్ వల్ల ఇప్పటి యుద్ధాల కంటే ఎక్కువ నష్టం జరిగే అవకాశం మాత్రం ఉంది.

ఎడిబుల్ ఎలక్ట్రానిక్స్ 

పొట్టలో ఏదైనా సమస్యగా అనిపిస్తే ఒక గోలీ వేసుకోవడం అలవాటు చాలామందికి. ఆ టాబ్లెట్‌‌లో ఉండే మెడిసిన్స్​ సమస్యను తగ్గిస్తాయి. అయితే ఇకపై ఇలా మందులు కాకుండా ఎలక్ట్రానిక్ పరికరాలు శరీరంలోకి  వెళ్లి రిపేర్ చేస్తాయట. దీనికోసం ‘ఎడిబుల్ ఎలక్ట్రానిక్స్’ అనే కొత్త టెక్నాలజీని తయారుచేస్తున్నారు. ఇది మనిషి డీఎన్‌‌ఏకు ఎలాంటి నష్టం కలిగించకుండా పనిని పూర్తి చేస్తాయి. ఇందులో నానో బ్యాటరీ, నానో కండక్టర్స్ ఉంటాయి. 

సెల్యూలోజ్, యాక్టివేటెడ్ కార్బన్, మెగ్నీషియం, జింక్ లాంటి మెటల్స్‌‌తో వీటిని తయారుచేస్తారు. ఇవి ముఖ్యంగా డైజెస్టివ్ హెల్త్‌‌కు బాగా పనిచేస్తాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు కడుపులో వచ్చే సమస్యను పసిగట్టి, వాటికి తగ్గట్టుగా రెస్పాండ్​ అయ్యి, ఆటోమేటిక్‌‌గా సమస్యను తగ్గిస్తాయి. భలే ఉంది కదా! కానీ, ఈ టెక్నాలజీ ఇంకా ప్రయోగ దశలోనే ఉంది.