టెక్నాలజీ  : అనారోగ్యాలకు  టెక్​ సొల్యూషన్స్

టెక్నాలజీ  : అనారోగ్యాలకు  టెక్​ సొల్యూషన్స్

టెక్నాలజీ అంటే సోషల్ మీడియా మాత్రమే కాదు. సైన్స్​నూ టెక్నాలజీ ముందుకు తీసుకెళ్తోంది. అందులో భాగంగానే ఈ మధ్య మలేరియాకు చెక్​ పెట్టే కొత్త టెక్నాలజీ కనుక్కున్నారు రీసెర్చర్లు. అంతేకాదు మరో టెక్నాలజీ త్రీడీ బయో ప్రింటింగ్​తో క్యాన్సర్​ ట్రీట్​మెంట్​ కూడా సులువుగా చేసేయొచ్చు అంటున్నారు. వాటి గురించిన వివరాలే ఇవి...

మలేరియాకు చెక్

కాలిఫోర్నియా శాన్​ డియాగో యూనివర్సిటీలోని పరిశోధకులు​ ప్రొఫెసర్​ ఒమర్ అక్బారీ లాబోరేటరీలో ఒక రీసెర్చ్​ చేశారు. దోమ కాటు వల్ల వచ్చే మలేరియాను అడ్డుకోవడమే లక్ష్యంగా ఆ స్టడీ చేశారు. మలేరియా కలిగించే అనాఫిలస్ గాంబియా రకం దోమల సంతతి పెరగకుండా చేయడమే ఆ స్టడీ ఉద్దేశం. ఆఫ్రికాలోని పేదరికం ఉండే ప్రాంతాల్లో ఈ దోమలు ఎక్కువగా ఉంటాయట. అందువల్ల మలేరియాకు కారణమయ్యే ఆడ అనాఫిలస్ దోమల జనాభాని తగ్గిస్తే, దోమ కాటు సమస్య ఉండదు.. మలేరియా వ్యాధి వ్యాప్తి జరగదు అంటున్నారు రీసెర్చర్లు.

ఈ స్టడీకి మొదట ప్రాణం పోసింది ఆండ్రియా స్మిడ్లర్. ఆమె అదే యూనివర్సిటీలో బయో లాజికల్ సైన్స్ చదివిన పోస్ట్​ డాక్టోరల్ స్కాలర్. ఆమెతోపాటు మరికొందరు స్టూడెంట్స్​, రీసెర్చర్స్​ కలిసి ‘ఇఫెజెనియా’ అనే సిస్టమ్​ని తయారుచేశారు. దీని​ గురించి సింపుల్​గా చెప్పాలంటే ఈ రీసెర్చర్లు ఫీమేల్​లెస్​(ఫ్లి) అనే జన్యువును తయారుచేశారు. ఇది ఆడ దోమల్లో రిప్రొడక్షన్​ డెవలప్​మెంట్​ను అదుపు చేస్తుంది. అలా మలేరియాకి కారణమయ్యే దోమల జనాభా తగ్గిపోతుంది అంటున్నారు వాళ్లు.

త్రీడీ బయోప్రింటింగ్​తో ట్రీట్​మెంట్ ఈజీ

ఎక్స్​రే కంటే బయోప్రింటింగ్​తో ట్రీట్​మెంట్ మరింత సులువు అవుతుంది అంటున్నారు ఎక్స్​పర్ట్స్. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా క్యాన్సర్ ట్రీట్​మెంట్​ కోసం త్రీడీ బయో ప్రింటింగ్​ వచ్చింది. దీంతో స్కాన్​ చేస్తే కణాలు, వాటిని డెవలప్ చేసే కారకాలతోపాటు, గుండెలోని గదులు, కృతిమ కీళ్లు, డెంటల్ ఇంప్లాంటేషన్స్ వంటివాటిని కూడా రియలిస్టిక్​గా చూపిస్తుంది. పైగా ఇది ఎక్కువ వేగంతో, తక్కువ ఖర్చుతో అయిపోతుందని అంటున్నారు. ఉదాహరణకు చర్మం కాలిన పేషెంట్లకు స్కిన్ గ్రాఫ్ట్​ అవసరమవుతుంది. అప్పుడు శరీరంలో నుంచి హెల్దీ స్కిన్ తీసి కాలిన చర్మం మీద రీప్లేస్ చేస్తారు. ఇందులో బయో ప్రింటింగ్​ పాత్ర ఏంటి అంటే... కాలిన గాయం మీద చర్మ కణాలు ఈజీగా ప్రింట్​ చేయొచ్చు.

దీని వల్ల కొన్నిసార్లు స్కిన్ గ్రాఫ్ట్ సర్జరీల అవసరం రాదు. క్యాన్సర్​ ట్రీట్​మెంట్​లో కూడా బయో ప్రింటింగ్​ బాగా పనిచేస్తుంది. త్రీడీ బయోప్రింటింగ్​ ద్వారా శరీరంలో కణానికి–కణానికి మధ్య, కణానికి​–మ్యాట్రిక్స్ మధ్య ఇంటరాక్షన్స్ జరుగుతుంది. బయోప్రింట్​ తీసిన క్యాన్సర్ నమూనాలు నిజమైన ట్యూమర్​​లానే కనిపిస్తాయి. దాంతో తయారుచేసిన మెడిసిన్​ని బయోప్రింటెడ్​ నమూనాల మీద టెస్ట్​ చేయొచ్చు. ఇలాచేయడం వల్ల మెడిసిన్​ ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవడం ఈజీ అవుతుంది. దాంతో ట్రీట్​మెంట్​ చేయడం సులువు అవుతుంది.