
టెక్నో తన మెగాబుక్ సిరీస్ ల్యాప్టాప్లను మనదేశంలో బుధవారం లాంచ్ చేసింది. ఇవి సన్నగా, తేలికగా ఉంటాయి. దీని బరువు కేవలం 1.56 కిలోలు. ఇందులో 15.6-అంగుళాల డిస్‌ప్లే, విండోస్ 11 హోమ్ ఓఎస్, 16 జీబీ ర్యామ్, 1టీబీ ఎస్ఎస్డీ, ఇంటెల్ 11 జెనరేషన్ ప్రాసెసర్ ఉంటాయి. మెగాబుక్టీ1 ధర కోర్ ఐ3 ప్రాసెసర్ కాన్ఫిగరేషన్కు రూ.37,999 కాగా, కోర్ ఐ5 వేరియంట్ ధర రూ.48 వేలు కాగా, ఐ7 ప్రాసెసర్ వేరియంట్ ధర రూ. 57,999. అమెజాన్ద్వారా వీటిని ఆర్డర్ చేయవచ్చు.