2 నెలలుగా కోమాలో.. చికెన్ పేరు చెప్పగానే స్పృహలోకొచ్చిండు

2 నెలలుగా కోమాలో.. చికెన్ పేరు చెప్పగానే స్పృహలోకొచ్చిండు

చికెన్ కర్రీ అంటే ప్రతీ ఒక్కరూ ఇష్టంగా తింటారు. ఒక్కరోజు తినకపోయినా ఏదో వెలితిగా ఉంటుంది. అలా కోమాలోకి వెళ్లిన యువకుడికి చికెన్ లెగ్ పీస్ ఆర్డర్ వచ్చింది లేచి తినూ అని చెప్పడంతో స్పృహలోకి రావడం వైరల్ గా మారింది.

తైవాన్ లోని నార్త్ వెస్ట్రన్ లో నివాసం ఉండే 18ఏళ్ల చియు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాపడ్డాడు. అత్యవసర చికిత్స కోసం బాలుడిని అతడి కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు బాధితుడికి కిడ్నీలు,లివర్ తో పాటు ఇంట్రనల్ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయని చెప్పారు. చియు ఆరోగ్యం బాగుండాలంటే ఆపరేషన్లు చేయాలని డాక్టర్లు అతని తల్లిదండ్రులకు చెప్పారు. అలా చియుకు సుమారు 6 మేజర్ ఆపరేషన్లు జరిగాయి. ఆపరేషన్లు సక్సెస్ కాకపోవడంతో బాలుడు కోమాలోకి వెళ్లిపోయాడు. కోమాలోకి వెళ్లిన 62వ రోజు అతని అన్నయ్య ఆస్పత్రికి వచ్చాడు. జోగా కోమాలో ఉన్న తమ్ముడితో అన్న ఇలా…తమ్ముడు నీకెంతో ఇష్టమైన బోన్ లెస్ చికెన్ తినేందుకు వెళుతున్నాననంటూ చెప్పాడు. అంతే కోమాలో ఉన్న బాధితుడు ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాడు. తాజాగా చియు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నాడు. ఈ సందర్భంగా తనకు ట్రీట్మెంట్ చేసిన వైద్యులకు చియు ట్రీట్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.