‘తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఆగస్టు 19న విడుదల

‘తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఆగస్టు 19న విడుదల

సినిమాపై ప్యాషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేన్ నాగం తిరుపతి రెడ్డి.. ఆది సాయికుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ‘తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. కళ్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ గోగణ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 19న విడుదలవుతున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సినిమా చూశాను. ఎంతో అద్భుతంగా వచ్చింది. అనుకున్నదానికంటే బాగుంది. ఆది సాయికుమార్ చాలా కొత్తగా కనిపించారు.

ఆది, పాయల్ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కెమిస్ట్రీ బాగా వర్కవుటయ్యింది. ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్ చూశాక మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీశాం. నటీనటు లందరూ అద్భుతంగా యాక్ట్ చేశారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి అన్ని వైపుల నుంచి మంచి స్పందన వచ్చింది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరిస్తుంది. ప్రమోషన్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.