Teja Sajja Super Yodha: సూపర్ యోధగా తేజ సజ్జ..టైటిల్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్

Teja Sajja Super Yodha: సూపర్ యోధగా తేజ సజ్జ..టైటిల్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్

తేజ సజ్జ (Teja Sajja)..హనుమాన్(HanuMan) మూవీ బ్లాక్ బస్టర్ తో ఈ హీరో క్రేజ్ కూడా నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. అందుకే.. ఈ హీరో చేస్తున్న తరువాతి సినిమాలపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. తేజ హనుమాన్ తరువాత ఎలాంటి సినిమా చేయనున్నాడు అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

అయితే, ఇటీవలే ఈగల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని(Karthik Gattamaneni)తో తేజ సజ్జ నెక్స్ట్ సినిమా చేయనున్నాడు. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ ప్రాజెక్టు కు సంబందించిన కథా చర్చలు కూడా ఇప్పటికే జరిగాయని సమాచారం.

తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్,ఫస్ట్ లుక్ రిలీజ్‍కు డేట్ ఖరారైంది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ను ఏప్రిల్ 18న రిలీజ్ చేయనున్నట్టు అఫిసియల్ ప్రకటన చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇదేరోజు రానుంది.  ‘సూపర్ యోధ అడ్వెంచరస్ సాగా’ అనే ట్యాగ్ తో తేజ ఉన్న పోస్టర్ పోస్ట్ చేసింది. అయితే, ఈ సినిమాకు సూపర్ యోధ అనే టైటిల్ ఉంటుందా..వేరేది ఏమైనా ప్రకటిస్తారా అనేది చూడాలి. ఇక ఈ సినిమాకు మిరాయ్ అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ మూవీలో మంచు మనోజ్ విలన్‍గా నటించనున్నారని టాక్. అలాగే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై హై లెవల్ బజ్ క్రియేట్ అయింది. 

అయితే..ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.40 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడానికి సిద్దమవుతున్నారట. ఇది తెలిసిన నెటిజన్స్ షాకవుతున్నారు. నిన్నమొన్నతవరకు కోటి, రెండు కోట్లలో సినిమాలు చేసిన తేజ..హనుమాన్ సక్సెస్ తో ఏకంగా రూ.40 కోట్ల రేంజ్ కి చేరిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా హిట్ అయింది అంటే తేజ సజ్జను ఆపడం ఎవరి తరం కాదనడంలో ఎలాంటి సందేహం లేదు.