పాట్నా: 10వ సారి బీహార్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన జేడీయూ అధినేత నితీష్ కుమార్‌కు ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫస్ట్ టైమ్ నితీష్‌ను అభినందించారు తేజస్వీ. నితీష్ కుమార్‌తో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలకు కూడా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభినందనలు తెలిపాడు.
‘‘ముఖ్యమంత్రి పదవిని స్వీకరించినందుకు నితీష్ కుమార్‌ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కొత్త ప్రభుత్వం ప్రజల అంచనాలను తీర్చాలని.. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు, హామీలను నెరవేర్చాలి. బీహార్ నివాసితుల జీవితాల్లో సానుకూల, గుణాత్మక మార్పు తీసుకురావాలి’’ అని తేజస్వీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేృత్వత్వంలోని ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ సీట్లగానూ 202 స్థానాలు దక్కించుకుని కనివినీ ఎరుగని గెలుపు నమోదు చేసింది. ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 89 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా.. జేడీయూ 85 సీట్లు గెలుపొందింది. ఎల్జేపీ (ఆర్వీ)19, హెచ్ఏఎం 5, ఆర్ఎల్ఎం 4 సీట్లలో విజయం సాధించాయి. మహాఘట్బంధన్ కూటమి కేవలం 35 సీట్లను మాత్రమే గెలుచుకుని మరోసారి ప్రతిపక్షానికే పరిమితమైంది.
ALSO READ : ఎర్రకోట దాడిలో ఇస్లామాబాద్ ప్రమేయం..
ఎన్డీఏ కూటమి స్పష్టమైన విజయం సాధించడంతో జేడీయూ అధినేత నితీష్ కుమార్ మరోసారి బీహార్ సీఎం పగ్గాలు చేపట్టారు. గురువారం (నవంబర్ 20) పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన ప్రమాణస్వీకారోత్స కార్యక్రమంలో 10వ సారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నితీష్ కుమార్‌తో పాటు 26 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
