ద్రౌపది ముర్ముకు సపోర్టు చేయాలని కేసీఆర్ కు జెప్పిన

ద్రౌపది ముర్ముకు సపోర్టు చేయాలని కేసీఆర్ కు జెప్పిన

న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన ద్రౌపది ముర్ముకు కేసీఆర్ మద్దతు ఇవ్వకపోవడం తనను బాధించిందని తేజావత్ రామచంద్రు నాయక్ తెలిపారు. రేపు భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ద్రౌపది ముర్మును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఎంతో సేవ చేశానని ఆయన చెప్పారు. ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కు చెబితే పట్టించుకోలేదని పేర్కొన్నారు. అందుకే తన పదవికి రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. ఆదివాసీలంటే కేసీఆర్ కు మొదటి నుంచి చిన్న చూపేనని ఆరోపించారు.

మొట్టమొదటి ఆదివాసీ గవర్నర్ గా ముర్ము సేవలందించారన్న ఆయన... ఇప్పుడు ఏకంగా తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా ముర్ము ఎన్నిక కావడం గర్వంగా ఉందన్నారు. మోడీ లేకుంటే రాష్ట్రపతి కావాలన్న ఆదివాసీల కల నెరవేరేది కాదని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ వల్లే ఓ ఆదివాసీ మహిళ తొలిసారి రాష్ట్రపతి అయ్యిందన్న ఆయన... అందుకు మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే టీఆర్ఎస్ కు రాజీనామా చేశానన్న ఆయన... భవిష్యత్ లో ఏ పార్టీలో చేరేది ఆలోచించలేదని తెలిపారు.