జాగిలాలతో పోలీసుల తనిఖీలు

జాగిలాలతో పోలీసుల తనిఖీలు

టేకులపల్లి, వెలుగు: మత్తు పదార్థాలను కనిపెట్టేందుకు జాగిలాలతో పోలీసులు బుధవారం తనిఖీలు చేపట్టారు. గంజాయి, మాదకద్రవ్యాలను కనిపెట్టేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ జాగిలాలతో టేకులపల్లి మండలంలోని పాత గంజాయి నేరస్తుల ఇళ్లల్లో, నిర్మానుష్య ప్రదేశాలలో టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, సిబ్బంది జాగిలంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

 మండలంలోని పలుచోట్ల టేకులపల్లి సీఐ ఆధ్వర్యంలో గంజాయి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.   గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం మండలంలోని నామినేషన్, పోలింగ్ కేంద్రాలను ఇల్లెందు డిఎస్పి ఎన్. చంద్రబాను సందర్శించి పరిశీలించారు.