విద్యార్థుల కోసం ఉద్యమాలకు సిద్ధమవుతున్న ABVP 

విద్యార్థుల కోసం ఉద్యమాలకు సిద్ధమవుతున్న ABVP 

బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఏబీవీపీ డిమాండ్ చేసింది. 9000 మంది విద్యార్థులు గత 7 రోజులుగా ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకుండా పోలీసుల నిర్బంధంతో నిరంకుశంగా వ్యవహరిస్తోందని ABVP తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ, బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేంత వరకూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 

ఏబీవీపీ ఉద్యమ కార్యాచరణ : 
మంగళవారం (జూన్ 21న) రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, ప్రభుత్వ దిష్టిబొమ్మల శవయాత్రలు నిర్వహించి, దగ్ధం చేసే కార్యక్రమాలు చేపట్టాలని ఏబీవీపీ పిలుపునిచ్చింది. 

బుధవారం (జూన్ 22న) రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. 

గురువారం (జూన్ 23న ) మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల కార్యాలయాల ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. 

ఏబీవీపీ డిమాండ్స్ :

? బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జోక్యం చేసుకొని సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

? బాసర ట్రిపుల్ ఐటీకి వెంటనే రెగ్యులర్ వైస్ చాన్స్ లర్ ను నియమించాలి.

? బాసర ట్రిపుల్ ఐటీలో 90% ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలి.

? బాసర ట్రిపుల్ ఐటీలో మౌలిక వసతుల కల్పనకు వెంటనే నిధులను విడుదల చేయాలి.

? విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హాస్టల్ వసతి కల్పించాలి.

? గత నాలుగేళ్లుగా ఇవ్వాల్సిన ల్యాప్ టాప్ లను అందించాలి.