సాగర్ డ్యాంపై ఏపీ, తెలంగాణ పోలీసుల పంచాయితీ

సాగర్ డ్యాంపై ఏపీ, తెలంగాణ పోలీసుల పంచాయితీ

నాగార్జున సాగర్ లో మరోసారి తెలంగాణ, ఏపీ పోలీసుల వివాదం తెరపైకి వచ్చింది. సాగర్ డ్యాంపై ఏపీ సివిల్ పోలీసులు, తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల మధ్య వివాదం జరిగింది.  ఏపీకి చెందిన ఎస్ఐ వాహనాన్ని టీఎస్ ఎస్పీఎఫ్ సిబ్బంది డ్యాంపైకి అనుమతించలేదు. ఏపీ పరిధిలోకి వెళ్లిన తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది వాహనాలకు ఏపీ సివిల్ పోలీసులు చలానా విధించారు. ఈవిధంగా ఇరు రాష్ట్రాల పోలీసుల పంతాలతో వివాదం ముదిరింది.

దీంతో ఈ పంచాయితీ ఉన్నతాధికారుల దాకా వెళ్లింది.  అయితే విషయం బయటకు పొక్కకుండా ఉన్నతాధికారులు రాజీ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు డ్యాంకు ముప్పు ఉందనే కారణంతో భద్రతా సిబ్బందిని పెంచినప్పటికీ.. ఎస్పీఎఫ్ అధికారులు ఎవర్ని పడితే వాళ్ళను అనుమతిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.  ఈ సమాచారాన్ని నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే.. ‘తెలిసినవాళ్లే’ అంటూ విషయాన్ని దాటివేస్తున్నట్లు తెలిసింది.