గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు

గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు

రాష్ట్రంలో రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య గ్యాప్‌ కొనసాగుతూనే ఉంది. గవర్నర్ తమిళిసైను కేసీఆర్ సర్కార్ మరోసారి పక్కనబెట్టింది. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి శాసనసభ 8వ సెషన్ 4వ విడత సమావేశాలంటూ ప్రకటన వెలువడింది. మరోవైపు తనకు బడ్జెట్ సమావేశాలు, రిపబ్లిక్ డే ఆహ్వానం అందలేదని రెండు రోజుల క్రితం గవర్నర్ చెప్పారు.

గతేడాది సెప్టెంబర్లో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. అయితే అసెంబ్లీని ప్రోరోగ్ చేయలేదు. దీంతో గత సమావేశాలకు కొనసాగింపుగానే.. ఫిబ్రవరి సెషన్స్ కొనసాగనున్నాయి. గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు మొదలు కానున్నాయి. గవర్నర్ తో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో... 2021 సెప్టెంబర్ 27న మొదలైన సమావేశాల కొనసాగింపుగానే ప్రభుత్వం అసెంబ్లీ సెషన్స్ నిర్వహిస్తూ వస్తోంది. గతేడాది బడ్జెట్ సమావేశాలు, ఆ తర్వాత సెప్టెంబర్లో వారం పాటు సమావేశాలు, ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 12.10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. సమావేశాల ప్రారంభం రోజునే బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశముంది.