
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. 24వ తేదీన మొదలైన సమావేశాలు ఇవాళ ముగిశాయి. 7 రోజులు సభ నడిచింది. 7 బిల్లులకు, ఒక తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. బీసీ కులగణనపై తీర్మానం పెట్టారు. ఏడు రోజుల సమావేశాల్లో సభ 37 గంటల 5 నిమిషాలు జరిగింది. మొత్తం 27 ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 41మంది ఎమ్మెల్యే లు చర్చల్లో పాల్గొన్నారు. 7 బిల్లులు ఆమోదం పొందాయి. ఆరు అంశాలపై సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది.
ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్..కేంద్రమే డయ్యింగ్ పొజిషన్లో ఉంటే మనకేమిస్తుందన్నారు. బీజేపీ వాళ్లు నిధుల పిచ్చి మానుకోవాలన్నారు. సంక్షేమంలో కాంగ్రెస్ కంటే 3రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నామన్నారు. కాళేశ్వరంపై కొందరు మొరుగుతున్నారు, కానీ తాము పట్టించుకోమన్నారు. రాష్ట్రంలో గంజాయి నివారణపై చర్యలు తీసుకుంటామన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు పోయాకే అభివృద్ధి ఎక్కువగా జరుగుతోందన్నారు సీఎం.