ప్రధాని వస్తే రాలేనంత బిజీ షెడ్యూల్ ఏముంది?

ప్రధాని వస్తే రాలేనంత బిజీ షెడ్యూల్ ఏముంది?

కేసీఆర్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్.... ఇదేనా మీ సంస్కారం? 80 వేల పుస్తకాలు చదివానన్న మీ జ్ఝానం ఏమైపోయింది? అంటూ ప్రశ్నించారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చినా రాలేనంత బిజీ షెడ్యూల్ ఏముంది?  అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. మీరు కోరినప్పుడల్లా ప్రధాని అపాయిట్ మెంట్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా?  రాష్ట్రానికి ప్రధాని వస్తే స్వాగతం పలకాలనే సోయి లేకుండా ఫాంహౌజ్ కే పరిమితమవుతారా? అంటూ నిలదీశారు. 

కుంటిసాకులు చెబుతూ తప్పించుకోవడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా?  నీ భాషను చూసి దేశమంతా అసహ్యించుకుంటుంటే ప్రధానికి ముఖం చూపించలేక తప్పించుకున్నావా?  అంటూ కేసీఆర్ తీరుపై బండి సంజయ్ మండిపడ్డారు.  మీలాంటి సంస్కార హీనుడు, మూర్ఖుడు, అహంకారి రాష్ట్రానికి సీఎంగా కొనసాగడం సిగ్గు చేటన్నారు. రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానిస్తాన్నారు. ప్రోటోకాల్ పాటించకుండా దేశ ప్రధానిని అవమానిస్తారు... మీ కుసంస్కారానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?     అంటై బండి ఫైర్ అయ్యారు. మీ భాష, మీ సంస్కారం చూసి తెలంగాణ సభ్య సమాజం  ఛీదరించుకుంటోందన్నారు. కేసీఆర్ లాంటి మూర్ఖుడు సీఎంగా కొనసాగడం సిగ్గు చేటన్నారు. 

ఇవి కూడా చదవండి: 

ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరం

రాహుల్.. భారత్ అప్పటిలా బలహీనంగా లేదు