మతం పేరుతో రాజకీయం.. కాంగ్రెస్, ఎంఐఎం దోస్తీ బట్టబయలైంది: కిషన్ రెడ్డి

మతం పేరుతో రాజకీయం.. కాంగ్రెస్, ఎంఐఎం దోస్తీ బట్టబయలైంది: కిషన్ రెడ్డి

మతాన్ని అడ్డంపెట్టుకుని ఎంఐఎం రాజకీయం చేస్తుందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు  కిషన్ రెడ్డి.  ఎంఐఎం ,కాంగ్రెస్ రెండు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఓవైసీ కుటుంబం వేల కోట్ల ఆస్తులు సంపాదించిందని ఆరోపించారు. కాంగ్రెస్ , ఎంఐఎం పొత్తును ప్రజలు ఖండించాలన్నారు. ఎంఐఎంను మచ్చిక చేసుకునేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అసద్ కోసం పనిచేస్తామని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారన్నారు.  ఫిరోజ్ ఖాన్ మాటలతో కాంగ్రెస్, ఎంఐఎం దోస్తీ బట్టబయలైందన్నారు. మజ్లిస్ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్ ,బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.  

కాంగ్రెస్ ,బీఆర్ఎస్ కొత్త నాటకాన్ని మొదలు పెట్టాయని మండిపడ్డారు కిషన్ రెడ్డి.  ఈ రెండు పార్టీలు కలిసి హైదరాబాద్ ను ఏం అబివద్ది చేశాయని ప్రశ్నించారు. ఓట్ల కోసం ఈ మూడు పార్టీలు దేనికైనా దిగజారుతాయని విమర్శించారు.  రాష్ట్రంలో కాంగ్రెస్  తెస్తాననన్న మార్పు ఏదన్నారు.  ఎంఐఎం గుండా రాజకీయాలు ప్రజల ముందు పెడుతున్నామని చెప్పారు.  

ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు కానీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ లో మార్పు వచ్చిందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో హిందూ వ్యతిరేక ద్వేషాన్ని  ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో  బీజేపీ మెజారిటీ సీట్లు గెలుస్తుందన్నారు.