- ఇరు కుటుంబాలు, బంధువుల సమక్షంలో ఘనంగా వివాహం
ఎల్లారెడ్డిపేట, వెలుగు: తెలంగాణ అబ్బాయి.. ట్యూనీషియా అమ్మాయి ప్రేమ పెండ్లితో ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన యువకుడు బుచ్చగారి చైతన్య రెండేండ్ల కింద ఉత్తర ఆఫ్రికాలోని ట్యూనీషియా దేశానికి జాబ్ కోసం వెళ్లాడు. అక్కడ యువతి ఇమెన్ బెన్ తో పరిచయమై ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తమ కుటుంబ సభ్యులకు చెప్పారు.
యువతి ఇమెన్ బెన్ తన ఫ్యామిలీతో కలిసి నెల కింద ఇండియాకు వచ్చి అబ్బాయి పేరెంట్స్ తో మాట్లాడారు. దీంతో హిందూ సంప్రదాయం ప్రకారం ముహూర్తం నిర్ణయించి శుక్రవారం వేదమంత్రాల సాక్షిగా పెండ్లి జరిపించారు. పెండ్లికి అమ్మాయి పేరెంట్స్ హెచ్ బెన్, నేత్ర బెన్ హిందూ సంప్రదాయాలను పాటించడం బంధువులను, గ్రామస్తులను ఆకట్టుకుంది.
