Telangana Budget : నియోజకవర్గానికి 3 వేల 500 ఇందిరమ్మ ఇండ్లు

Telangana Budget : నియోజకవర్గానికి 3 వేల 500 ఇందిరమ్మ ఇండ్లు

ప్రతీ నియోజకవర్గానికి రూ. 3 వేల 500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపడుతామన్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. గత సర్కార్ పేదలకు డబుల్ బెడ్ రూంలని మోసం చేసిందని.. కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశపెట్టామని తెలిపారు. ఇళ్లు లేనివారికి ఇండ్లు, స్థలం ఉంటే.. నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం చేస్తామని.. ఆ నిధులను  కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఇవ్వబోతున్నామని చెప్పారు.  ప్రతి నియోజకవర్గానికి 3వేల500 ఇండ్ల చొప్పున ఇస్తామని.. ఈ బడ్జెట్ లో రూ. 7,740 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. 

పరిశ్రమల శాఖకు రూ. 2543 కోట్లు కేటాయించామన్నారాయన. పంచాయతీరాజ్ శాఖకు రూ. 40, 080 కోట్లు కేటాయించామని వివరించారు. ఉపాధి కల్పన జోన్ గా మూసీ పరివాహక ప్రాంతం ఉందని చెప్పారు. 

తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల కోసం రూ. 500 కోట్లు.. యూనివర్సిటీల్లో సదుపాయాల కోసం రూ. 500 కోట్లు కేటాయిస్తామన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల కోసం రూ.  300 కోట్లు.. గృహ నిర్మాణానికి రూ. 7540 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. బీసీ సంక్షేమం కోసం రూ.8000 వేల కోట్లు.. గురుకులాల సొంత భవనాల కోసం రూ. 1546 కేటాయిస్తామన్నారు భట్టి విక్రమార్క.