
తెలంగాణలోని ప్రైవేట్ కారు ఓనర్లకు ఊహించని షాక్ తగిలింది. జాతీయ రహదారులు & ఎక్స్‌ప్రెస్‌వేల కోసం కేంద్రం త్వరలో ప్రారంభించనున్న ఫ్రీ టోల్ పాస్ పథకాన్ని తెలంగాణ వాహనదారులు పొందలేకపోవచ్చు. ఎందుకంటే ఆగష్టు 15న ప్రారంభించనున్న ఈ పథకం కోసం తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ డేటా సెంట్రల్ వాహన్ డేటాబేస్‌లోకి మార్చకపోవడం కారణమని తెలుస్తుంది.
ఈ పథకం కింద ప్రైవేట్ కార్, జీప్ & వ్యాన్లకి రూ.3వేలకే FASTag ఏడాది పాస్ ఇస్తుంది. దింతో జాతీయ రహదారులపై ఏడాదికి 200 ఫ్రీ టోల్ ట్రిప్‌లు చేసుకోవచ్చు. ఇందుకు వాహన రిజిస్ట్రేషన్ వివరాలు వాహన్ పోర్టల్‌లో తప్పనిసరి నమోదై ఉండాలి. కేంద్ర రవాణా కార్యదర్శి వి. ఉమాశంకర్ మాట్లాడుతూ గత వారం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో రాష్ట్ర వాహన డేటాను కేంద్ర వ్యవస్థకి మార్చేందుకు వెంటనే చర్య తీసుకోవాలని కోరం చెప్పారు.
కేంద్రం మే 2024లోనే తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయంపై లేఖ రాసింది, ఇప్పటికి ఎలాంటి స్పందన లేదు. దేశంలోని అన్ని ఇతర రాష్ట్రాలు ఇప్పటికే వాటి డేటాను వాహన్ & సారథి పోర్టల్‌లకు మార్చాయి. తెలంగాణలో ఈ ఆలస్యం వల్ల కొత్త టోల్ పాస్ పథకం మాత్రమే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ (DL), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) సేవలు కూడా జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతాయి.
ALSO READ : డ్రగ్స్ పై ఈగల్ టీం ఉక్కుపాదం.. హైదరాబాద్ లో రూ. 4 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం..
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రస్తుతం ఈ పథకం కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు అలాగే టోల్ పాస్ గురించిన సందేహాలు పరిష్కరించడానికి శిక్షణ పొందిన ప్రత్యేక కాల్ సెంటర్ బృందంతో సహా ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ వాహన రికార్డులను వాహన్ పోర్టల్‌తో అనుసంధానించే వరకు ప్రైవేట్ వాహనదారులు ఈ పథకానికి అనర్హులుగా ఉంటారు.