హైదరాబాద్, వెలుగు: ఆదివాసీ గిరిజన పోరాట యోధుడు బిర్సా ముండా150వ జయంతి వేడుకలు హైదరాబాద్లోని గిరిజన మ్యూజియంలో ఘనంగా జరిగాయి. శనివారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. బిర్సా ముండా, రాంజీ గోండు, కొమురం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి వారి త్యాగాలను స్మరించుకున్నారు.
కార్యక్రమంలో ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ పోచం, డిప్యూటీ డైరెక్టర్ ప్రియాంక, మ్యూజియం క్యురేటర్ ద్యావనపల్లి సత్యనారాయణ, ఉద్యోగులు పాల్గొన్నారు.
