తెలంగాణ ఇషాన్‌‌‌‌‌‌‌‌ .. ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో గోల్డ్‌‌‌‌‌‌‌‌, సిల్వర్‌‌‌‌‌‌‌‌ గెలిచిన ఇషా సింగ్​

తెలంగాణ ఇషాన్‌‌‌‌‌‌‌‌ ..  ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో గోల్డ్‌‌‌‌‌‌‌‌, సిల్వర్‌‌‌‌‌‌‌‌ గెలిచిన ఇషా సింగ్​

చైనా గడ్డపై తెలంగాణ బిడ్డ ఇషా సింగ్‌‌‌‌‌‌‌‌ అదరగొట్టింది. ఈ టీనేజ్‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌ ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో టీమ్‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌,  సిల్వర్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌తో మెప్పించింది. మరో యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ సిఫ్ట్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌  కూడా గోల్డ్‌‌‌‌‌‌‌‌, సిల్వర్‌‌‌‌‌‌‌‌తో సత్తా చాటగా.. నాలుగో రోజు ఇండియా షూటర్లు ఏకంగా ఏడు మెడల్స్‌‌‌‌‌‌‌‌తో ఔరా అనిపించారు.  గేమ్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా పతకాల సంఖ్య 20 దాటింది.

హాంగ్జౌ:  ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌ షూటర్ల గురి అదిరింది. బుధవారం రెండు గోల్డ్‌‌‌‌‌‌‌‌, మూడు సిల్వర్‌‌‌‌‌‌‌‌, రెండు బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌తో పతకాల మోత మోగించారు. ఇందులో మన హైదరాబాదీ, 18 ఏండ్ల ఇషా సింగ్‌‌‌‌‌‌‌‌ 25 మీ. పిస్టల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో మను భాకర్‌‌‌‌‌‌‌‌, రిథమ్‌‌‌‌‌‌‌‌ సాంగ్వాన్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఇండియాకు గోల్డ్‌‌‌‌‌‌‌‌ అందించింది. ఫైనల్లో ఇండియా త్రయం ప్రెసిషన్‌‌‌‌‌‌‌‌, ర్యాపిడ్‌‌‌‌‌‌‌‌ మూడేసి సిరీస్‌‌‌‌‌‌‌‌ల్లో కలిపి 1759 స్కోరుతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌ సాధించింది. చైనా 1756 స్కోరుతో సిల్వర్‌‌‌‌‌‌‌‌, కొరియా 1742తో బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ గెలిచాయి. 

అనంతరం 25 మీ. పిస్టల్‌‌‌‌‌‌‌‌ వ్యక్తిగత విభాగం ఫైనల్లో ఆరంభంలో తడబడినా తర్వాత పుంజుకున్న ఇషా 34 పాయింట్లతో రెండో స్థానంతో సిల్వర్‌‌‌‌‌‌‌‌ గెలిచింది. చైనా షట్లర్‌‌‌‌‌‌‌‌ లియు రుయి 38 పాయింట్లతో గేమ్స్‌‌‌‌‌‌‌‌ రికార్డు బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేస్తూ గోల్డ్‌‌‌‌‌‌‌‌ నెగ్గగా.. కొరియా షూటర్‌‌‌‌‌‌‌‌ జిన్‌‌‌‌‌‌‌‌ యాంగ్‌‌‌‌‌‌‌‌ (29) బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ గెలిచింది. మను భాకర్‌‌‌‌‌‌‌‌ 21 పాయింట్లతో ఐదో ప్లేస్‌‌‌‌‌‌‌‌తో సరి పెట్టింది.  50మీ. రైఫిల్‌‌‌‌‌‌‌‌ 3 పొజిషన్స్‌‌‌‌‌‌‌‌ వ్యక్తిగత ఈవెంట్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో సిఫ్ట్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌ 469.6 స్కోరుతో వరల్డ్‌‌‌‌‌‌‌‌, ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌ రికార్డును బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేస్తూ టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌తో గోల్డ్‌‌‌‌‌‌‌‌ నెగ్గి  ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. ఇదే ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో అశీ చౌక్సే (451.9) బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ సొంతం చేసుకుంది. ఆ తర్వాత 50 మీ. రైఫిల్‌‌‌‌‌‌‌‌ 3 పొజిషన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో మానిని, అశీ, సిఫ్ట్‌‌‌‌‌‌‌‌ త్రయం 1764 స్కోరుతో రెండో స్థానంతో సిల్వర్‌‌‌‌‌‌‌‌ గెలిచింది. చైనా (1773) గోల్డ్‌‌‌‌‌‌‌‌, కొరియా (1756) బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ ఖాతాలో వేసుకున్నాయి.

స్కీట్‌‌‌‌‌‌‌‌లో అబ్బాయిల జోరు

పిస్టల్‌‌‌‌‌‌‌‌, రైఫిల్‌‌‌‌‌‌‌‌లో అమ్మాయిలు మెరిస్తే స్కీట్‌‌‌‌‌‌‌‌లో మెన్స్‌‌‌‌‌‌‌‌ సిల్వర్‌‌‌‌‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌‌‌‌‌తో రాణించారు. మెన్స్‌‌‌‌‌‌‌‌ స్కీట్‌‌‌‌‌‌‌‌ వ్యక్తిగత విభాగం ఫైనల్లో అనంత్‌‌‌‌‌‌‌‌ జీత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ 58 స్కోరుతో రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌తో వెండి పతకం సొంతం చేసుకున్నాడు. స్కీట్ మెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో అంగద్‌‌‌‌‌‌‌‌ వీర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, గుర్‌‌‌‌‌‌‌‌జోత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌తో జట్టు కట్టిన అనంత్‌‌‌‌‌‌‌‌ 355 స్కోరుతో మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌తో ఇండియాకు బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ అందించాడు. మరోవైపు ఇండియా సెయిలర్‌‌‌‌‌‌‌‌ విష్ణు శరవణన్ మెన్స్‌‌‌‌‌‌‌‌ డింఘీ ఐఎల్‌‌‌‌‌‌‌‌సీఏ7లో బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ గెలిచి ఈ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు తొలి పతకం అందించాడు. 11 రేసుల్లో కలిపి విష్ణు34 పాయింట్ల నెట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో  బ్రాంజ్​ నెగ్గాడు.

ఎదురులేని బుల్లెట్​

(హైదరాబాద్​, వెలుగు) రెండు పదుల వయసు కూడా కాదు. కానీ, నిండైన ఆత్మవిశ్వాసం ఆమె సొంతం. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తుంది. కానీ, ఆమె గురి పెడితే  పతకాల మోత మోగుతుంది. ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌‌‌‌‌ షూటింగ్‌‌‌‌‌‌‌‌లో కొన్నేండ్లుగా అదరగొడుతున్న ఇషా సింగ్‌‌‌‌‌‌‌‌ అంతర్జాతీయ వేదికపై మరోసారి తెలంగాణ సత్తా చూపెట్టింది. తన తొలి ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌లోనే డబుల్‌‌‌‌‌‌‌‌ ధమాకా మోగించింది. రేసర్​అయిన తండ్రి సచిన్​ స్ఫూర్తితో ఆటలపై మక్కువ పెంచుకున్న ఇషా ఓసారి గచ్చిబౌలి షూటింగ్ రేంజ్‌‌‌‌‌‌‌‌ను చూడ్డానికి వెళ్లి ఎయిర్ పిస్టల్ పట్టుకుంది. అప్పటి నుంచి ఆమెకు షూటింగే ప్రాణమైంది. బిడ్డ ఆసక్తిని గుర్తించి సచిన్​ తన ఇంట్లోనే పేపర్ ప్రాక్టీస్ రేంజ్‌‌‌‌‌‌‌‌  ఏర్పాటు చేసి ట్రెయినింగ్​ ఇప్పించాడు. 

ఒలింపిక్ విన్నర్​ గగన్ నారంగ్ గన్ ఫర్ గ్లోరీ అకాడమీలో చేరి ఆటలో రాటు దేలింది. 2014లో ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించిన ఇషా 2015లోనే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్​లో స్టేట్​ చాంపియన్​గా నిలిచింది. అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు.  2018లో నేషనల్​ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో  ఇండియా టాప్‌‌‌‌‌‌‌‌ షూటర్లు​ మను భాకర్, హీనా సిద్ధూను ఓడిస్తూ  10 మీ. ఎయిర్ పిస్టల్ గోల్డ్​ గెలవడం ఆమె కాన్ఫిడెన్స్​ను పెంచింది. 13 ఏండ్లకే  నేషనల్​ చాంపియన్​ అయిన ఇషా ఆ తర్వాతి ఏడాది జర్మనీలో జరిగిన జూనియర్ వరల్డ్​ కప్​లో సిల్వర్​, ఆసియా జూనియర్ చాంపియన్​షిప్​లో రెండు గోల్డ్​ మెడల్స్​తో ఇంటర్నేషనల్​ సర్క్యూట్​లో తన రాకను ఘనంగా చాటుకుంది. 

జూనియర్​ కేటగిరీలో ప్రతీ టోర్నీలోనూ పతకాల మోత మోగిస్తూ ముందుకెళ్లిన ఇషా 2020లో టోక్యో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు ఇండియా కోర్ జట్టుకు ఎంపికైంది. కానీ, క్వాలిఫికేషన్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో ఫెయిలైన ఆమె టోక్యో మెగా గేమ్స్​కు వెళ్లలేకపోయింది. అదే ఆమెలో కసిని పెంచింది. ఎలాగైనా 2024 పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అవ్వాలని మరింత కష్టపడింది. పర్సనల్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ వేద్‌‌‌‌‌‌‌‌ ప్రకాశ్‌‌‌‌‌‌‌‌ సపోర్ట్‌‌‌‌‌‌‌‌తో తన తప్పిదాలను సరిదిద్దుకొని, బలాలను పెంచుకుంది. నిండైన ఆత్మవిశ్వాసంతో సీనియర్‌‌‌‌‌‌‌‌ కేటగిరీలోకి అడుగు పెట్టిన ఆమె గతేడాది నుంచి  అద్భుతంగా రాణిస్తోంది. గతేడాది వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్​లో రెండు, వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌లో మూడు గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌ సాధించిన ఆమె ఈ ఏడాది బాకు వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో మరో రెండు గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌తో మెప్పించింది. తాజాగా ఆసియాడ్‌‌‌‌‌‌‌‌లో అదరగొట్టిన పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లోనూ పతకం నెగ్గే సత్తా తనకుందని నిరూపించుకుంది. ఇషా సింగ్​ను ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్​ అభినందించారు.

క్వార్టర్స్‌‌‌‌లో నిఖత్‌‌‌‌


తెలంగాణ స్టార్‌‌‌‌ బాక్సర్‌‌‌‌ నిఖత్‌‌‌‌ జరీన్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. విమెన్స్‌‌‌‌ 50 కేజీల ప్రిక్వార్టర్స్‌‌‌‌లో నిఖత్‌‌‌‌ 5–0తో చోరాంగ్‌‌‌‌ బాక్‌‌‌‌ (సౌత్‌‌‌‌ కొరియా)పై గెలిచింది. మెన్స్‌‌‌‌ 63.5 కేజీ క్వార్టర్‌‌‌‌ఫైనల్లో శివ థాపా 0–5తో అస్కాత్‌‌‌‌ కుల్టెవ్‌‌‌‌ (కిర్గిస్తాన్‌‌‌‌) చేతిలో ఓడాడు. 92 కేజీల్లో సంజీత్‌‌‌‌ కూడా 0–5తో లాజిజ్‌‌‌‌బెక్‌‌‌‌ చేతిలో కంగుతిన్నాడు. 

టెన్నిస్‌‌‌‌లో మెడల్‌‌‌‌ ఖాయం

టెన్నిస్‌‌‌‌లో ఇండియాకు మెడల్‌‌‌‌ ఖాయమైంది. మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో రామ్‌‌‌‌కుమార్‌‌‌‌–సాకేత్‌‌‌‌ మైనేని సెమీస్‌‌‌‌లోకి ప్రవేశించారు. క్వార్టర్స్‌‌‌‌లో రామ్‌‌‌‌–సాకేత్‌‌‌‌ 6–1, 7–6 (8)తో జీజెన్‌‌‌‌ జాంగ్‌‌‌‌–యిబింగ్‌‌‌‌ వుయ్‌‌‌‌ (చైనా)పై నెగ్గారు. ఇక, టీటీ మిక్స్​డ్​ డబుల్స్​లో ఆకుల శ్రీజ–హర్మీత్‌‌‌‌ సత్యన్‌‌‌‌–బత్రా,  మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో మానవ్‌‌‌‌–మానుష్​ తొలి రౌండ్లలో గెలిచారు.

సిల్వరే స్పెషల్‌‌‌‌‌‌‌‌


నాకు తొలి ఏషియాడ్‌‌‌‌‌‌‌‌ కావడంతో బెస్ట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని అనుకున్నా. స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లో కొంచెం ఆందోళన చెందినా పుంజుకొని రెండు  పతకాలు తెచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.  నా వరకు టీమ్‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌ కంటే వ్యక్తిగత సిల్వర్‌‌‌‌‌‌‌‌ మెడలే స్పెషల్‌‌‌‌‌‌‌‌.  10 మీటర్ల ఈవెంట్‌‌‌‌‌‌‌‌ (శుక్రవారం)లో బాగా రాణించేందుకు ఇవి నాలో  కాన్ఫిడెన్స్​ నింపుతాయి. ఈ మెడల్స్‌‌‌‌‌‌‌‌ను నా పేరెంట్స్‌‌‌‌‌‌‌‌, కోచ్‌‌‌‌‌‌‌‌కు  అంకితం ఇస్తున్నా.  
- ఇషా సింగ్‌

నేటి మెయిన్​ ఈవెంట్లు
షూటింగ్‌‌ మెడల్స్‌‌ ఈవెంట్స్‌‌ - 
ఉ. 6.30 నుంచి
ఉషు ఫైనల్‌‌ (రోషిబినా) ఉ. 7 నుంచి
ఈక్వెస్ట్రియన్‌‌ (డ్రెస్సేజ్‌‌ ఫైనల్స్‌‌) మ. 12.3. నుంచి
హాకీ మెన్స్‌‌ (ఇండియాxజపాన్‌‌) సా. 6.15 నుంచి
టెన్నిస్‌‌ డబుల్స్‌‌ సెమీస్‌‌- మ. 2 తర్వాత