హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్రలోని ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరేస్తామని బయటకు చెప్తున్న బీఆర్ఎస్ బాస్ కేసీఆర్..కన్నడనాట మాత్రం షాడో పాలిటిక్స్‌కు తెరతీశారు. కర్నాటకలో అడుగు పెట్టకుండానే అక్కడి రాజకీయాల్లో ఎత్తుగడలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా ఈ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది. అసెంబ్లీ పోరులో జేడీఎస్‌కు అన్నివిధాలుగా బీఆర్ఎస్ బ్యాక్ సపోర్ట్ చేస్తున్నది. అయితే, నేరుగా అక్కడికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేయడం కన్నా.. పోలింగ్‌కు ముందు కుమారస్వామి పార్టీకి అనుకూలంగా పోల్ మేనేజ్మెంట్ చేయడంపై, తెలుగువారి ఓట్లు గంపగుత్తగా జేడీఎస్‌కు పడేలా చేయడంపై కేసీఆర్ ఫోకస్ పెట్టినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీనికి బదులుగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్అభ్యర్థులకు జేడీఎస్సపోర్ట్చేయాలని అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రచారం సాగుతున్నది. ఈ క్రమంలోనే కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనను ఒక్క రోజుకు కుదించుకున్నట్లు తెలుస్తున్నది.
అసెంబ్లీ పోరులో పోటీపై మిడిల్ డ్రాప్
బీఆర్ఎస్ జాతీయ రాజకీయ ప్రస్థానం కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతోనే మొదలవుతుందని అప్పట్లో కేసీఆర్ ప్రకటించారు. కుమారస్వామిని మళ్లీ సీఎం చేయడమే తమ టార్గెట్ అని అన్నారు. అక్కడి ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడంతో పాటు జేడీఎస్తరఫున ప్రచారం కూడా చేస్తామని బాహాటంగానే చెప్పారు. కర్నాటక ఎన్నికల షెడ్యూల్వచ్చి అక్కడ రాజకీయం వేడెక్కినా కేసీఆర్ అటువైపు కన్నెత్తి చూడలేదు. కర్నాటకలో ఎన్నికలు జరుగుతుంటే మహారాష్ట్రలో వరుస సభలు నిర్వహిస్తూ మరాఠా జిల్లా పరిషత్ ఎన్నికలే తమ టార్గెట్అని చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కుమారస్వామితో కేసీఆర్‌కు పొరపొచ్చాలు వచ్చాయనే ఊహాగానాలు సాగాయి. వీటికి చెక్‌పెడుతూ జేడీఎస్కర్నాటక స్టేట్ ప్రెసిడెంట్ ఇబ్రహీం కొన్ని రోజుల కింద హైదరాబాద్‌కు వచ్చి బీఆర్ఎస్ ముఖ్య నేతలను కలిశారు.
కర్నాటకలో జేడీఎస్తరఫున తాము ప్రచారం చేస్తామని బీఆర్ఎస్ ముఖ్యనేతలు కొందరు హామీ ఇచ్చారే తప్ప అటువైపు ఎవరూ వెళ్లలేదు. బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన కొత్తలో ఉమ్మడి మహబూబ్నగర్జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు అక్కడికి వెళ్లి పార్టీ విస్తరణ కోసం ప్రయత్నించినా ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే ఆ ప్రయత్నాలు విరమించారు. కళ్యాణి కర్నాటక (పాత హైదరాబాద్‌స్టేట్‌లో అంతర్భాగంగా ఉన్న కర్నాటక)లో తెలంగాణ ప్రభుత్వ పథకాల ప్రభావం కొంతమేరకు ఉంటుందని, అక్కడ బీఆర్ఎస్ పోటీ చేస్తే కొన్ని సీట్లలో గెలుపు సులువేనని అంచనా వేసుకున్న ప్రగతి భవన్పెద్దలు తీరా ఎన్నికల నాటికి వచ్చేసరికి మిడిల్‌డ్రాప్ అయ్యారు.
ఎమ్మెల్యేలకు పోల్మేనేజ్మెంట్ బాధ్యతలు!
కర్నాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్మధ్య గట్టిపోటీ ఉండటంతో జేడీఎస్‌కు అన్ని రకాలుగా కేసీఆర్అండగా నిలుస్తున్నట్టు సమాచారం. పోల్ మేనేజ్మెంట్బాధ్యతలను కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఇతర నాయకులకు అప్పగించినట్టు తెలుస్తున్నది. కర్నాటకలో వ్యాపారాలు చేసే తెలంగాణ లీడర్లను ఇందుకు డిప్యూట్ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే కొందరు లీడర్లు ఈ టాస్క్‌లోకి దిగినట్టు సమాచారం.
ఒక్కసారి ప్రచారానికి వచ్చిపోండి
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగియనుంది. కనీసం చివరి రోజైన తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని జేడీఎస్ నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులు బీఆర్ఎస్ ముఖ్యులను కోరుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రచారానికి రావాలని ఆ పార్టీ నేతలు కోరినా కేసీఆర్ నిర్ణయం తీసుకోకపోవడంతో ఎవరూ అటువైపు వెళ్లలేదు. తాము కన్నడ ఎన్నికలకు దూరంగా ఉన్నామనే భావన రాజకీయవర్గాలకు కలిగించేందుకు కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు. అయినా.. అక్కడి ఎన్నికల్లో పోటీ చేస్తున్న జేడీఎస్ అభ్యర్థులకు బీఆర్ఎస్ ఫైనాన్షియల్సపోర్ట్అందిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ ఎంపీ స్థానాలు గెలువాలని కేసీఆర్ టార్గెట్‌గా పెట్టుకున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను జేడీఎస్‌కు వదిలేసి లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ తాము పోటీ చేయాలని భావిస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వ్యూహాత్మక మౌనం వహిస్తూ జేడీఎస్‌కు అవసరమైన బ్యాక్ సపోర్ట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.