
ప్రపంచంలో అన్నింటికన్నా ఏది ముఖ్యం అని అడిగితే... వచ్చే సమాధానం విద్య. ఆ తర్వాత స్థానాల్లో వైద్యం ఇతరత్రా అంశాలు నిలుస్తాయి. ఏ ప్రభుత్వమైనా తమ ప్రజల్ని, తమ ప్రాంతాన్ని వైభవోపేతం చేసుకోవాలంటే బలపర్చుకోవాల్సినవి ఆ సమాజంలోని విద్య, వైద్య రంగాల్లోని మౌలిక వసతులు. ఈ సత్యం తెలిసినవాడుగనకనే దార్శనికుడైన సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన చేయాలని సంకల్పించారు.
అందుకే స్వయంగా విద్యాశాఖను తనే పర్యవేక్షిస్తూ నూతన ఒరవడిని సృష్టిస్తూ తెలంగాణను రాబోయే రోజులకు విజ్ణాన ఖనిగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం ఏటా దాదాపు రూ.40వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తూ గత రెండు పర్యాయాలుగా కునారిల్లుతున్న విద్యావ్యవస్థకు జవసత్వాల్ని అందిస్తున్నాడు.
ఏకంగా 11వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేయడమే కాకుండా 312జీవో బదిలీల్లో ఈమూల వాళ్లను ఆ మూలకు, అక్కడివాళ్లను ఇక్కడికి ట్రాన్స్ఫర్లతో జరిగిన అన్యాయాల్ని సరిచేస్తూ టీచర్లలో ఎన్నోఏళ్లుగా పేరుకుపోయిన హెడ్మాస్టర్ ప్రమోషన్లు, సాధారణ స్పౌజ్ బదిలీలకు అవకాశం, పీఆర్సీపై కమిటీ, 5శాతం ఐఆర్ పెంపు ఇలా అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడమే కాకుండా, ఉన్నత విద్యావ్యవస్థలో కీలకమైన జూనియర్ లెక్చరర్స్ నియామకం మొదలు యూనివర్సిటీల వీసీల నియామకం వరకూ ప్రతి సమస్యను అంచెలంచెలుగా పరిష్కరించుకుంటూ విద్యావ్యవస్థను మెరుగుపరుస్తున్నారు.
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
పండ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు అనేది మనకు తెలిసిన సామెత, అలాగే రేవంత్ రెడ్డి సీఎంగా తీసుకున్న విప్లవాత్మక చర్యలతో విద్యారంగంలో వస్తున్న సమూల మార్పులు చూసి దొరలు, వారి వందీమాగధులు జీర్ణించుకోలేకపోతున్నారు, సాధారణంగా జరిగే ఎక్కడో, ఏదో చిన్న అపశృతిని తమ సొంత మీడియాతోపాటు తొత్తులుగా ఉన్న సోషల్ మీడియా వాళ్లతో కలిసి చిలువలు, పలువలుగా జనాల్లో అపనమ్మకాన్ని కలిగించేలా గోబెల్స్ ప్రచారాల్ని చేస్తున్నారు.
కానీ, నిజం ఎన్నటికీ దాగదు, అబద్ధం ఎల్లకాలం నిలవదు. ఇదే అంతిమ సత్యం. రోజు రోజుకూ మెరుగవుతున్న ప్రభుత్వ పాఠశాలల పనితీరుతో గతం కంటే ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరుతున్న విధానమే స్పష్టం చేస్తుంది, రాష్ట్రంలోని 26వేలకు పైగా స్కూల్స్ లో మౌలిక వసతుల్ని అభివృద్ది చేస్తూనే.. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ కిండర్ గార్డెన్ ను ప్రవేశపెట్టారు. ప్రతి మండలంలో మోడల్‌గా నర్సరీ నుంచి విద్యా భోదనకు శ్రీకారం చుట్టడమే కాకుండా, అందుకవసరమైన సిబ్బందిని సైతం మంజూరు చేశారు.
ఈమధ్య జరిగిన టీచర్ దినోత్సవ సందేశంలో సీఎంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర విద్యావ్యవస్థలో రావాల్సిన మార్పులపై, చేయాల్సిన, చేస్తున్న సంస్కరణలపై స్ఫష్టమైన సందేశం ఇచ్చారు, ప్రభుత్వాధినేతగా పాఠశాలకు కావాల్సిన ప్రతీది అందిస్తానని చెప్పిన ఆయన, క్వాలిఫైడ్ ఉపాధ్యాయులుగా తమపై జాతి మొత్తం నమ్మకం పెంచుకునేలా విధ్యాబోధన అందించాలని సుతిమెత్తగా చేసిన సూచన వారిలో స్ఫూర్తిని కలిగించింది.
నాలెడ్జ్ బేస్డ్ స్కిల్ యూనివర్సిటీ
రాబోయే జనరేషన్ అంతా ఏఐ చుట్టే తిరుగుతుందని ఇప్పటికే అనేక సంస్థలు, సీఈవోలు నొక్కి వక్కాణిస్తున్నారు, ఈ సమయంలో కేవలం బట్టీ ఆధారిత చదువులు కాకుండా సంపూర్ణ, సమ్మిళిత విద్యను అందించాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వాధినేత హోదాలో సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారు. అందుకే రేపటికి అనుగుణంగా విద్యార్థుల్ని, విద్యావ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఏకంగా నాలెడ్జ్ బేస్డ్ స్కిల్ యూనివర్సిటీని ప్రప్రథమంగా ఏర్పాటుచేశాడు.
దానికి వీసీగా ఇండస్ట్రీ బెస్ట్ పర్సన్‌గా పేరుతెచ్చుకున్న ఆనంద్ మహీంద్రాను ఒప్పించి నియమించారు. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ని ఏర్పాటు చేస్తున్నారు, కేవలం హార్డ్ వర్క్ ఎనేబుల్డ్ స్కిల్ సెంటర్లుగా ఉన్న ఐటీఐలను అత్యంత అధునాతన ఏటీసీలుగా మార్చి ఎన్నో ప్రపంచ నైపుణ్యాలను తెలంగాణ యువతకు అందిస్తున్నారు. నేడు సీఎం నాటిన ఈ విత్తనాలు మహావృక్షాలై తెలంగాణను సుసంపన్నం చేస్తాయనడంలో సందేహం లేదు.
యువతరానికి బంగారు భవిష్యత్తు
ప్రపంచం గర్వించే ఎంటర్ప్రెన్యూర్లను తయారుచేయడం, అలాగే నైపుణ్యం ఉన్న యువతను రూపొందించడంతో పాటు వారికి అవకాశాలు అందివచ్చేలా ముందుచూపుతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దాని పర్యవసానమే ఫోర్త్ సిటీ నిర్మాణం, ట్విన్ సిటీస్ నుండి సైబర్ సిటీగా మారిన మన భాగ్యనగరం సిగలో మరో ఆణిముత్యమే ఈ ఫోర్త్ సిటీ, సీఎంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సాధించిన పెట్టుబడులు, దక్షిణ కొరియా, జపాన్, అమెరికా వంటి దేశాల్లో చేసిన పర్యటనలతో దాదాపు 2లక్షల కోట్లకు పైగా సాధించిన పెట్టుబడులతో ఫోర్త్ సిటీ ఒక నిర్మాణాత్మక పెట్టుబడి సాధించడమే కాకుండా, నైపుణ్యవంతమైన మన యువతకు ఎన్నో అవకాశాల్ని అందించే గనిలా మారుతుంది.
ఇప్పటికే ఫాక్స్ కాన్ వంటి పరిశ్రమల వల్ల వేలాది మంది తెలంగాణ యువత లబ్ధి పొందుతున్నారు. అదే రీతిలో నాణ్యమైన విద్యతో బయటకు వస్తున్న స్కిల్డ్ తెలంగాణ విద్యార్థులకు ఇటు ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేట్ రంగంలోనూ అపార అవకాశాల్ని సృష్టిస్తున్నది.
ఏడాది వ్యవధిలోనే 60వేలకు పైగా ఉద్యోగాలు
కేవలం ఏడాదిలోనే 60వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల్ని అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎస్సీ వర్గీకరణ చేశారు, బీసీ రిజర్వేషన్ల కోసం చివరికంటూ ప్రయత్నిస్తున్నారు. తెలంగాణను సామాజిక న్యాయం వైపు పరుగు పెట్టిస్తున్నారు. నాయకుడు అవసరం లేని సమాజాన్ని నిర్మించడమే నిజమైన నాయకుడి పనితనం అని చెప్పినట్టుగా ఆ దిశగా సమాజాన్ని విద్య ద్వారా నడిపించాలని సంకల్పించిన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి, కేవలం పనే పరమావధిగా నిరంతరం రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని కేవలం విద్యారంగంలో తీసుకొచ్చిన ఈ సంస్కరణలతోనే అర్థం చేసుకోవచ్చు.
- పున్నా కైలాష్ నేత,జనరల్ సెక్రటరీ, టీపీసీసీ-