కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 23న పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులకు వేతనంతో కూడిన సెలవుదినం ప్రకటించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్‌చేశారు. ఆదివారం శ్రీరాంపూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులు అహర్నిశలు కష్టపడుతూ సంస్థ ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాలను సాధిస్తున్నారని అన్నారు.
సంస్థకు వచ్చిన లాభాలను రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి సంబంధంలేని కార్యకలాపాలకు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, పండగలు, జాతర్లు, జాబ్‌మేళా ఈవెంట్లకు ఖర్చు చేస్తోందని విమర్శించారు. ఫుట్బాల్దిగ్గజం లియోనల్మెస్సీతో 20 నిమిషాల ఆట కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఏకంగా రూ.10 కోట్ల సింగరేణి నిధులను ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో టీబీజీకేఎస్ శ్రీరాంపూర్ఏరియా వైస్ప్రెసిడెంట్బండి రమేశ్, కేంద్ర జాయింట్‌సెక్రటరీ పానుగంటి సత్తయ్య,అన్వేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
